డ్రగ్స్ కేసులో స్టార్ కపుల్స్ కు నోటీసులు  

Diganth Manchale and Aindrita Ray summoned by CCB, Kannada Film Industry, Drugs Mafia, Sanjana Galrani, Ragini Dvivedi, Bangalore - Telugu Bangalore, Diganth Manchale And Aindrita Ray Summoned By Ccb, Drugs Mafia, Kannada Film Industry, Ragini Dvivedi, Sanjana Galrani

ఒక వైపు బాలీవుడ్ లో డ్రగ్స్ మాఫియాపై ముంబైలో డొంక కదులుతూ ఉంటే మరో వైపు కన్నడ చిత్ర పరిశ్రమలో బెంగుళూరు వేదికగా డ్రగ్స్ డొంకని కదిలించే ప్రయత్నం నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో పోలీసులు చేస్తున్నారు.దేశ వ్యాప్తంగా కరోనా తర్వాత చిత్ర పరిశ్రమలో నడుస్తున్న ఈ డ్రగ్స్ భాగోతాలు సంచలనంగా మారాయి.

 Diganth Manchale And Aindrita Ray Summoned By Ccb

ప్రతి రోజు ఈ డ్రగ్స్ కేసులో కొత్త కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి.ఇప్పటికే బెంగుళూరులో ఎన్సీబీ పోలీసులు హీరోయిన్స్ సంజనా గల్రానీ, రాగినీ ద్వివేదిని అరెస్ట్ చేసి విచారిస్తూ ఉండగా మరో వైపు వారు ఇస్తున్న ఆధారాలతో చాలా మందికి నోటీసులు పంపిస్తున్నారు.

దీంతో కన్నడ ఇండస్ట్రీలో అందరికి ఇప్పుడు ఈ కేసు భయం పట్టుకుంది.ఎప్పుడు ఎవరి పేరు బయటకి వస్తుందో అనే టెన్షన్ వాతావరణం అక్కడ ఉంది.

డ్రగ్స్ కేసులో స్టార్ కపుల్స్ కు నోటీసులు-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇదిలా సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తాజాగా కన్నడ నటీనటులు, స్టార్ కపుల్ దిగంత్, ఐంద్రితలకు సమన్లు జారీ చేశారు.

విచారణకి హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు.

ఈ కేసులో కీలక నిందితుడైన షేక్ ఫాజిల్ శ్రీలంకలోని ఐ బార్టనే అనే క్యాసినోకు వీరిని ఆహ్వానించిన వీడియో వైరల్ అవుతోంది.దీని ఆధారంగా వీరికి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది.

అయితే విచారణ తర్వాత వీరికి డ్రగ్స్ సప్లయర్స్ తో సంబంధాలు ఉన్నాయా లేదా అనే విషయాలు తెలిసే అవకాశం ఉంది.మరో వైపు కర్ణాటక మాజీ మంత్రి జీవరాజ్ అల్వా కుమారుడు ఆదిత్యపై డ్రగ్స్ కేసు నమోదైంది.

ఆయనకు చెందిన రిసార్ట్ పై ఈ ఉదయం సీసీబీ పోలీసులు రెయిడ్ చేశారు.ఆదిత్య ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు.ఇక ఈ డ్రగ్స్ కేసులో చాలా మంది సినీ రాజకీయ ప్రముఖుల జాతకాలు బయటపడే అవకాశం ఉందని తెలుస్తుంది.

#DiganthManchale #Sanjana Galrani #KannadaFilm #Ragini Dvivedi #Drugs Mafia

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Diganth Manchale And Aindrita Ray Summoned By Ccb Related Telugu News,Photos/Pics,Images..