ఆ రాష్ట్రంలో కరోనా తుఫాను.. పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లోకి వైర‌స్‌

ఆ రాష్ట్రంలోని పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లోకి క‌రోనా చొరబడింది.ముగ్గురు డీఐజీలు, ఒక ఏఐజీ స్థాయి అధికారికి కరోనా పాజిటివ్‌గా తేలింది.175 రోజుల తర్వాత ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ రాష్ట్రంలో కరోనా కేసులు వెయ్యికిపైగా న‌మోద‌య్యాయి.అదే సమయంలో గ‌డిచిన‌ ఇరవై నాలుగు గంటల్లో కరోనా కారణంగా మూడు మరణాలు కూడా సంభవించాయి.

 Dig And Ig Range Officers Infected With Corona Virus In Chattisgarh Details, Dig-TeluguStop.com

రాయ్‌పూర్‌లో అత్యంత దుర్భ‌ర‌ పరిస్థితి ఏర్పడింది.కరోనా కేసులు ఒక నిర్దిష్ట ప్రాంతం లేదా సంస్థలో న‌మోదువుతున్నాయి.

రాయ‌పూర్ నగరంలోని చాలా వీధుల్లో క‌రోనా కేసులు వెలుగు చూస్తున్నాయి.ఎయిమ్స్‌, అంబేద్కర్ హాస్పిటల్, మెడికల్ కాలేజీ హాస్టళ్లలోని విద్యార్థులు కూడా క‌రోనా బారిన పడ్డారు.

రాయ్‌పూర్‌లో 343 కేసులు నమోదు కాగా, యాక్టివ్ కేసులు 847కి పెరిగాయి.ఇక్కడ నిరంతరం పెరుగుతున్న కేసుల కారణంగా, ఇన్ఫెక్షన్ రేటు 6.47కి చేరుకుంది.రాయ్‌పూర్ జిల్లాలో కరోనా క‌ట్ట‌డికి ఆంక్షలు కూడా అమలు చేశారు.

మూడు రోజుల క్రితం రాష్ట్ర ఆరోగ్యశాఖ‌ మంత్రికి క‌రోనా పాజిటివ్‌ వచ్చింది.అనంతరం పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో విధులు నిర్వ‌హిస్తున్న‌ డిఐజి ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యారు.

వీరితో స‌న్నిహితంగా ఉన్న డీఐడీ దంపతులకు ఏఐజీ స్థాయి అధికారికి క‌రోనా సోకింది.

Telugu Officers, Bilaspur, Carona, Chatisgarh, Chattisgarh, Digig, Corona, Omico

వీరంతా ప్ర‌స్తుతం హోమ్ ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు అయితే వారిలో ఎటువంటి క‌రోనా లక్షణాలు లేవు.రాయ్‌పూర్‌తో పాటు, బిలాస్‌పూర్, రాయ్‌గడ్‌లలో కూడా కరోనా కేసులు నమోదయ్యాయి.తాజాగా కోర్బా, దుర్గ్ జిల్లాలలో కూడా క‌రోనా కేసులు కనిపిస్తున్నాయి.

బిలాస్‌పూర్‌లో ఇద్దరు, రాయ్‌గడ్ జిల్లాలో ఒకరు క‌రోనా కార‌ణంగా మరణించారు.రాయ‌పూర్ నగరంలో 21 కంటైన్‌మెంట్ జోన్లు ఏర్పాటు చేశారు.

రాష్ట్రంలో తాజాగా 1059 మంది కరోనా బారిన పడ్డారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube