చెంచాతో సొరంగం త‌వ్వి.. జైలు నుంచి ఎస్కేప్‌

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన వేటసినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది.ఈ మూవీలో చిరంజీవిని ఖైదీగా బందించి ఓ జైలులో పడేస్తారు.

 Dig A Tunnel With A Spoon  . Escape From Jail, Jail, Viral News ,. Escape From J-TeluguStop.com

అక్కడ జైలులో ఉన్న వృద్ధుడి సాయంతో చిరంజీవి చిన్న చిన్న వస్తువులను పోగు చేసుకుని సొరంగాన్ని తవ్వే ప్రయత్నం చేస్తుంటాడు.ఆ సీన్ చూస్తే మీకు ఏం అనిపించి ఉంటుంది? ఇలాంటి పని రియల్ లైఫ్‌లో సాధ్యం అయ్యేనా? అనే అనుమానం వచ్చి ఉంటుంది కదా.కాగా, తాజాగా ఆ సీన్ జరిగింది.ఇజ్రాయెల్‌కు చెందిన గిల్బోవా అనే జైలులో ఓ వ్యక్తి చెంచాల సాయంతో జైలులోని బలమైన గోడలను తవ్వి సొరంగం సాయంతో తప్పించుకున్నాడు.

అతడొక్కడే కాకుండా మరో ఆరుగురు ఖైదీలను జైలు నుంచి తప్పించాడు.ఈ విషయం తెలుసుకుని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.బలమైన గోడలను అతడు ఎలా తవ్వి ఉంటాడని చర్చించుకుంటున్నారు.నిజానికి గిల్బోవా అనే జైలులో సెక్యురిటీ ఫుల్ టైట్‌గా ఉంటుంది.

అయినా ఖైదీలు తప్పించుకోగలిగారు వారు ఎవరంటే.ఇస్లామిక్‌ జిహాద్‌కు చెందిన ఐదురురితో పాటు అల్‌ అక్సా మార్టిర్స్‌ బ్రిగేడ్‌ నాయకుడు కొన్నేళ్లుగా అక్కడ శిక్షను అనుభవిస్తున్నారు.

Telugu Escape Jail, Ijrail Jail, Jail, Palisthina, Spoon, Tunnel-Latest News - T

వీరిలో నలుగురు జీవత ఖైదు అనుభవించాల్సి ఉంటుంది.పాలస్తీనాకు చెందిన వీరంతా జైలు నుంచి తప్పించుకోవాలని ప్లాన్ వేసుకున్నారు.ఈ నేపథ్యంలోనే వారు సెల్‌లో ఉన్న సింక్‌ను ఆధారంగా చేసుకొని జైలు బయట వరకు భారీ సొరంగాన్ని తవ్వగలిగారు.ఇలా సొరంగం పూర్తిగా తవ్వని తర్వాతే బయటకు వెళ్లాలనుకున్నారు.

ఇందుకు వారు చెంచాను ఉపయోగించడం ఆశ్చర్యకరం.అలా సొరంగం నుంచి బయటకు వచ్చిన వారు పంట పొలాల నుంచి పారిపోవడాన్ని తాము గమనించినట్లు స్థానిక రైతులు చెప్తున్నారు.

మొత్తానికి ఖైదీలు చెంచానే ఆయుధంగా చేసుకుని బయటకు రావడం చర్చనీయాంశమే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube