రోడ్డు దాటడానికి బాతు ఇబ్బందులు.. ట్రాఫిక్ పోలీసు ఔదార్యం

సోషల్ మీడియాలో ఏ వీడియో ఎప్పుడు వైరల్ అవుతుందో చెప్పలేం.సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతీ వీడియో వైరల్ అవుతుంది.

 Difficulties Of Ducks To Cross The Road The Generosity Of The Traffic Police , Road, Viral Latest, News Viral, Social Media, Traffic-TeluguStop.com

ముఖ్యంగా పక్షులు, జంతువులకు సంబంధించిన ఫన్నీ వీడియోలు విపరీతంగా వైరల్ అవుతూ ఉంటాయి.వీటిని చూసేందుకు నెటిజన్లు బాగా ఆసక్తి చూపుతూ ఉంటారు.

ఇలాంటి వీడియోలను చూసి ఆనందపడుతూ ఉంటారు.ఇప్పుడు తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.

 Difficulties Of Ducks To Cross The Road The Generosity Of The Traffic Police , Road, Viral Latest, News Viral, Social Media, Traffic -రోడ్డు దాటడానికి బాతు ఇబ్బందులు.. ట్రాఫిక్ పోలీసు ఔదార్యం-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఓ తల్లి బాతు తన పిల్లలతో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తోంది.అయితే అక్కడే ఉన్న పోలీస్ అధికారి ఆ బాతులకు సహాయం చేశాడు.బాతులు రోడ్డు దాటేందుకు వాహనాలను ఆపాడు.వాహనాలను ఆపేసి బాతులను ఇవతల రోడ్డుకు వచ్చేలా సహాయం చేశాడు.

ఇది చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు.పోలీస్ అధికారి చేసిన సహయానికి ఫిరా అవుతున్నారు.

బాతుల కోసం రోడ్డుపై వెళుతున్న వెహికల్స్ ఆపిన పోలీస్ అధికారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

పోలీస్ అధికారి జంతువులపై ఉన్న ప్రేమను చాటుకున్నాడని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

పారిస్ లో ఈ ఘటన చోటుచేసుకుంది.కొంతమంది వాహనదారులు దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.పోలీస్ అధికారిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

పక్షులు కూడా మనుషులు లాంటివేనని, వాటికి కూడా హక్కు ఉందంటున్నారు.పోలీస్ అధికారి చేసిన పనిలో ఎలాంటి తప్పు లేదంటున్నారు.ఇలాంటి పోలీస్ అధికారులు సమాజానికి అవసరమని కితాబు ఇస్తున్నారు.

21 సెకన్ల పాటు ఈ వీడియో ఉంది.ఇప్పటివరకు 3 మిలియన్ల మంది ఈ వీడియోను చూశారు.లక్షమందికిపైగా లైక్ చేశారు.అలాగే చాలామంది ఈ వీడియోను షేర్ చేస్తున్నారు.దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube