ఏయే దేవుళ్ల‌కు ఏ ఆహారాల‌ను నైవేద్యంగా పెడితే కోరిన కోరికలు తీరతాయి  

Different Types Of Naivedyam For Gods-telugu Devotional

హిందూ మతంలో ప్రతి ఒక్కరు తమ ఇష్ట దైవాన్ని పూజిస్తూ ఉంటారు.వారంలోఒక్క రోజు వారికీ ఇష్టమైన దైవాన్ని పూజించి నైవేద్యాన్ని పెడతారు.

Different Types Of Naivedyam For Gods-telugu Devotional-Telugu Trending Latest News Updates Different Types Of Naivedyam For Gods-telugu Devotional-Different Types Of Naivedyam For Gods-Telugu Devotional

రోజును బట్టి దైవాన్ని బట్టి నైవేద్యం కూడా మారుతుంది వారంలో ఒక్కో రోజు ఒక్కో దేవుడికి ఇష్టమైన రోజు.ఆ రోజులను వారికీ ఇష్టమైన నైవేద్యాలు గురించి తెలుసుకుందాం.

శ్రీరాముడు శ్రీరాముడికి పానకం వడపప్పు అంటే ఇష్టం వీటిని నైవేద్యంగా పెట్టి పూజచేస్తే కోరుకున్న కోరికలు నెరవేరతాయి దంపతులు కలిసి పూజ చేస్తే వారి దాంపత్యంలో కలతలు లేకుండా అన్యోన్యంగా ఉంటారు.

Different Types Of Naivedyam For Gods-telugu Devotional-Telugu Trending Latest News Updates Different Types Of Naivedyam For Gods-telugu Devotional-Different Types Of Naivedyam For Gods-Telugu Devotional

 

శివుడు శివునికి ఇష్టమైన రోజు సోమవారం ఆయనకు దద్దోజనం అంటే ఇష్టం దద్దోజనంను నైవేద్యంగా పెట్టి కోరికలను కోరుకుంటే వెంటనే నెరవేరతాయి.

అయ్యప్ప స్వామి ప్రతి సంవత్సరం చాలా మంది భక్తులు అయ్యప్ప మాల ధరించి శబరిమల వెళ్లి మాల తీసి కోరికలు తీర్చమని వేడుకుంటారు అయ్యప్ప స్వామికి పేలాలు అంటే ఇష్టం అందువల్ల అయ్యప్ప భక్తులు పూజ సమయంలో పేలాలను నైవేద్యంగా పెడతారు.

శ్రీ కృష్ణుడు శ్రీ కృష్ణుడు కి వెన్న అంటే చాలా ఇష్టం అందువల్ల కృష్ణుడిని వెన్న దొంగ అని ముద్దుగా పిలుస్తూ ఉంటాం అందువల్ల కృష్ణుడికి వెన్నను నైవేద్యంగా పెడితే కోరిన కోరికలు నెరవేరతాయి.

ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామికి అప్పాలు అంటే చాలా ఇష్టం అప్పాలను నైవేద్యంగా పెడితే కోరిన కోరికలు నెరవేరతాయి

లక్ష్మి దేవి శ్రావణ మాసంలోనే కాకుండా ప్రతి శుక్రవారం లక్ష్మి దేవికి పూజ చేస్తూ ఉంటాం లక్ష్మి దేవికి బూరెలను నైవేద్యంగా పెడితే అమ్మ అనుగ్రహం ఉంటుంది.

వినాయకుడు వినాయకుణ్ణి వినాయకచవితి రోజునే కాకుండా ఏదైనా పని ప్రారంభించినప్పుడు కూడా పూజిస్తారు వినాయకునికి కుడుములు, ఉండ్రాళ్ళు అంటే చాలా ఇష్టం అందువల్ల వీటిని నైవేద్యంగా పెడితే అనుకున్న పనులు సకాలంలో జరుగుతాయి.

తాజా వార్తలు