ఎలాంటి నోటి సమస్యకి ఎలాంటి టూత్ పేస్ట్ తీసుకోవాలి ?  

Different Toothpaste You Should Use For Different Oral Problems -

స్కిన్ క్రీమ్ అంటే ఒకటే ఉండదు కదా.మొటిమలకి వేరే క్రీమ్ ఉంటుంది, మచ్చలకి వేరే ఉంటుంది, దురదకి వేరే ఉంటుంది, కాలిన గాయాలకు వేరే ఉంటుంది .

ఇలా చెప్పుకుంటే పొతే, రకరకాల చర్మ సమస్యలకి రకరకాల ఫేస్ క్రీమ్స్ ఉంటాయి.మరి టూత్ పేస్ట్ కూడా అంతేగా.

Different Toothpaste You Should Use For Different Oral Problems -Different Toothpaste You Should Use For Different Oral Problems - -Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు-Telugu Tollywood Photo Image

అలాగే నోటి సమస్యలు కూడా అంతేగా.నోటి సమస్యల్లో కూడా రకాలు ఉంటాయి.

కొందరికి దంతాలు తెల్లగా కావాలని ఉంటుంది, కొందరికి చిగుర్లలో నొప్పిగా ఉంటుంది.అలాంటప్పుడు ఇద్దరు ఒకటే టూత్ పేస్ట్ వాడితే ఎలా ? కాబట్టి ఎలాంటి సమస్యకి ఎలాంటి టూత్ పేస్ట్ వాడాలో ఇప్పుడు చూడండి.

* దంత క్షయం మీ సమస్య అయితే, సోడియం ఫ్లోరైడ్ లభించే టూత్ పేస్ట్ వాడండి.ఇది ఆసిడిక్ ఫుడ్ నుంచి మీ దంతాలను కాపాడుతుంది.కాని జాగ్రత్త సుమ, చిన్నపిల్లలకి టూత్ పేస్ట్ తినే అలవాటు ఉంటుంది.అలాంటివారికి ఈరకం టూత్ పేస్ట్ దూరంగా పెట్టాలి.

* వేడివేడిగా ఉండే వస్తువు కాని, చల్లగా ఉన్న పదార్థం కాని తింటే వెంటనే దంతాలలో ఎక్కడలేని నొప్పిగా ఉంటోందా ? ఇలాంటి సమస్య ఉన్నవారు Desensitizing టూత్ పేస్ట్ వాడటం ఉత్తమం.

* చిగుర్లలో నొప్పిగా ఉండటం, అప్పుడప్పుడు రక్తం రావడం జరుగుతోందా ? అలాంటప్పుడు Anti-gingivitis కలిగి ఉండే టూత్ పేస్ట్ వాడాలి.అదే పరిష్కార మార్గం.

* పండ్లపాచితో కొందరు తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొంటారు.ఇలాంటివారు Tartar-control టైప్ టూత్ పేస్ట్ ని ఆశ్రయించాలి.ఇలాంటి పేస్టులు పాచిని, ఓరల్ బ్యాక్టీరియాని కంట్రోల్ చేస్తాయి.

* ఇలాంటి సమస్యలు ఏమి లేకుండా, మీ దంతాలు తెల్లగా ఉండటం, బలంగా ఉండటమే మీకు కావాల్సింది అయితే, Whitening టూత్ పేస్టులు, మనం రెగ్యులర్ గా వాడే టూత్ పేస్టులు చాలు.కాని ఏ టూత్ పేస్ట్ వాడినా, మీ డెంటిస్ట్ ని సంప్రదించే వాడాలి.

తాజా వార్తలు

Different Toothpaste You Should Use For Different Oral Problems- Related....