విడ్డూరం : ఊరంతా కలిసి పెళ్లి చేస్తారు, కాని ఆ పెళ్లి ఒక్క రోజు కూడా నిలవదు  

Different Culture In Visakha District Miner Girl Fake Marriage With A Man-dhukkavanipalem,marriage On Bhogi Day,visakha,vizag And Anandapuram Mandalam

పెళ్లి అంటే నూరు సంవత్సరాల పంట.ఒక్కసారి పెళ్లి బంధంతో కలిసిన వారు జీవితాంతం ఒకరితో ఒకరు కలిసి ఉండాలి.

Different Culture In Visakha District Miner Girl Fake Marriage With A Man-Dhukkavanipalem Marriage On Bhogi Day Visakha Vizag And Anandapuram Mandalam

ఇతర దేశాలతో పోల్చితే మన దేశంలో విడాకులు అనేవి చాలా తక్కువగా ఉంటాయి.ఎందుకంటే మనం పెళ్లి బంధానికి చాలా ప్రాముఖ్యత ఇస్తూ ఉంటాం.

పెళ్లి అంటే చాలా ప్రాముఖ్యత కలిగిన విషయంగా మనం అనుకుంటాం.ఒక్కసారి బలవంతంగా మెడలో తాళి కట్టినా కూడా ఆ అమ్మాయి అబ్బాయికి పెళ్లాంగా జీవితాంతం ఉండాల్సిందే.

ఒక్కసారి మెడలో పడ్డ తాళిని తీసేయడం అంటే చాలా పెద్ద తప్పుగా ఇండియన్స్‌ భావిస్తూ ఉంటారు.

మెడలో తాళి పడ్డా కూడా దాన్ని పెద్దగా పట్టించుకోని సంప్రదాయం విశాఖపట్నటంలోని ఆనందపురం మండలం దుక్కవానిపాలెంలో ఉంది.ఆ గ్రామంలోని గ్రామస్తులు అంతా కలిసి భోగి పండుగ రోజు పెళ్లి చేస్తారు.ప్రతి సంవత్సరం ఆ పెళ్లి జరుగుతుంది.కాని పెళ్లి చేసుకున్న ఇద్దరు ఆ తర్వాత ఎవరికి వారే అన్నట్లుగా వెళ్లి పోతారు.అసలు ఆ పెళ్లిని పరిగణలోకి తీసుకోకుండా ఉంటారు.పెళ్లి అనేది జీవితాంతం కలిపి ఉంచేది అంటాం.కాని అక్కడ మాత్రం అది నిజం కాదు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.ఆ గ్రామంలోని వారు భోగి పండుగ రోజు పెద్ద మనిషి కాని అమ్మాయికి పెళ్లి చేస్తారు.

గ్రామస్తులు అంతా వచ్చి ఒక రెగ్యులర్‌ పెళ్లి ఎలా అయితే చేస్తారో అంతకు మించిన ఏర్పాట్లతో హంగు ఆర్బాటాలతో సహపంక్తి భోజనాలతో చేస్తారు.కాని పెళ్లి అయిన వెంటనే అమ్మాయి వాళ్ల ఇంటికి అబ్బాయి వారి ఇంటికి వెళ్లి పోతారు.

ఆ తర్వాత కూడా వారు వేరు వేరుగా పెళ్లి చేసుకుంటారు.ఈ ఉత్తిత్తి పెళ్లిని వారు పట్టించుకోరు.ఏ ఒక్కరు కూడా గుర్తుంచుకోరు.అలాంటప్పుడు ఎందుకు ఈ పెళ్లిలు చేయడం అంటే గ్రామం మంచిగా ఉండటం కోసం అంటున్నారు.

.

తాజా వార్తలు

Different Culture In Visakha District Miner Girl Fake Marriage With A Man-dhukkavanipalem,marriage On Bhogi Day,visakha,vizag And Anandapuram Mandalam Related....