వయస్సును బట్టి చర్మ సంరక్షణకు ఉపయోగించే పేస్ పాక్స్  

 • సాధారణంగా చర్మ తత్త్వం అనేది వయస్సును బట్టు మారుతూ ఉంటుంది. ఒక్కో వయస్సులో ఒక్కో రకంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వయస్సుకు తగ్గట్టుగా చర్మ సంరక్షణకు ఉపయోగించే పేస్ పాక్స్ గురించి తెలుసుకుందాం.

 • 18-20 ఏళ్ళు వయస్సు వారు
  వేడి నీటిలో గ్రీన్ టీ బ్యాగ్ వేసి 10 నిమిషాల పాటు ఆలా ఉంచాలి. ఆ తర్వాత గ్రీన్ టీ బ్యాగ్ తీసేసి, ఆ మిశ్రమం చల్లారిన తర్వాత కాటన్ సాయంతో ముఖానికి రాసి ఆరిన తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయటం వలన ఈ వయస్సులో వచ్చే మొటిమలు తగ్గిపోతాయి.

 • Different Ages Face Packs-

  Different Ages Face Packs

 • 20-25 ఏళ్ళు వయస్సు వారు
  ఒక బౌల్ లో ఒక నిమ్మకాయను రసం పిండాలి. దీనిలో ఒక స్పూన్ తేనే వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. ఆరిన తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయటం వలన ఈ వయస్సులో వచ్చే చర్మ సమస్యలు తగ్గిపోతాయి.

 • 25-30 ఏళ్ళు వయస్సు వారు
  ఒక గుడ్డు తెల్లసొనలో ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి 5 నిమిషాల పాటు మసాజ్ చేసి అరగంట తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

 • Different Ages Face Packs-
 • 30 ఏళ్ల వయస్సు వారు
  ఒక కప్పు బ్లూ బెర్రీలలో రెండు స్పూన్ల తేనే,ఒక స్పూన్ బ్రౌన్ షుగర్ వేసి మెత్తని పేస్ట్ గా మిక్సీ చేయాలి. ఈ పేస్ట్ ని ముఖానికి పట్టించి 10 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

 • 40 ఏళ్ల వయస్సు వారు
  4-5 బాదంలను పేస్ట్ చేయాలి. కలబంద కట్ చేసి, అందలోని జెల్ తీసుకోవాలి. ఈ రెండింటిని బాగా కలిపి ముఖం, మెడకు అప్లై చేయాలి. 30 నిముషాల తర్వాత చల్లని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.