ఆడ వారి క్రికెట్ కు మగవారి క్రికెట్ కు మ‌ధ్య ‌ ఉండే ముఖ్యమైన 5 తేడాలు!

క్రికెట్యువతను ఉర్రూతలు ఊగిస్తున్న క్రీడ.ప్రపంచంలో ఫుట్ బాల్ తర్వాత ఎక్కువ అభిమానులున్న ఆట.

 Differences Between Women And Men Cricket-TeluguStop.com

ఇండియాలో మాత్రం మరే క్రీడకూ లేని ఆదరణ క్రికెట్ కు ఉంది.దేశంలోని పిల్లలంతా చేతిలో బ్యాట్ పట్టుకుని గల్లీల్లోకి వస్తున్నారంటే ఆ క్రీడ మీద ఏ రేంజ్ క్రేజ్ ఉందో తెలుసుకోవచ్చు.

ప‌వ‌ర్ ప్లేలు, యార్డ్ స‌ర్కిల్స్, ఫ్రీ హిట్స్, సూపర్ ఓవర్లు అంటూ క్రికెట్ ను మరింత ఎంటర్ టైన్ కలిగించేలా ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూనే ఉన్నారు.అబ్బాయిలతో పాటు అమ్మాయిలూ క్రికెట్ లో సత్తా చాటుతున్నారు.

 Differences Between Women And Men Cricket-ఆడ వారి క్రికెట్ కు మగవారి క్రికెట్ కు మ‌ధ్య ‌ ఉండే ముఖ్యమైన 5 తేడాలు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే మెన్, ఉమెన్ క్రికెట్ మధ్య కొన్ని తేడాలు ఉన్నాయి.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

బాల్

మెన్, ఉమెన్ క్రికెట్ లో ప్రధానంగా వాడే బంతి బరువులో తేడా ఉంటుంది.పురుషులు వాడే బాల్ బరువు 156 గ్రాములు ఉండగా మహిళలు మాత్రం 142 గ్రాముల బరువు ఉండే బంతిని మాత్రమే వాడుతారు.

ఫీల్డింగ్మెన్ క్రికెట్ పవర్ ప్లే తర్వాత 30 యార్డ్స్ సర్కిల్ బయట ఐదుగురు ఫీల్డర్స్ ఉంటారు.కానీ ఉమెన్ మ్యాచ్ లో మాత్రం నలుగురు ప్లేయర్స్ మాత్రమే ఉంటారు.

బ్యాటింగ్ పవర్ ప్లే

మెన్ క్రికెట్ లో 2015 నుంచి బ్యాటింగ్ పవర్ ప్లే తీసేశారు.కానీ, ఉమెన్ క్రికెట్ లో బ్యాటింగ్ పవర్ ప్లే ఇప్పటికీ కొనసాగుతోంది.

బౌండరీ లైన్

మెన్ క్రికెట్ తో పోల్చితే ఉమెన్ క్రికెట్ లో బౌండరీ లైన్ దూరం తగ్గుతుంది.మెన్ క్రికెట్ లో 67 నుంచి 75 మీటర్ల మధ్య ఉంటే ఉమెన్ క్రికెట్ లో 55 నుంచి 65 మీటర్ల వరకు ఉంటుంది.

ఇన్నర్ సర్కిల్

ఇన్నర్ సర్కిల్ విషయంలోనూ మెన్, ఉమెన్ క్రికెట్ లో పలు తేడాలున్నాయి.మెన్ క్రికెట్ లో 30 యార్డ్స్ సర్కిల్ ఉంటే.ఉమెన్ క్రికెట్ లో 25 యార్డ్స్ సర్కిల్స్ మాత్రమే ఉంటాయి.

#Power Play #Fielding #Cricket #Boundarires #Ball

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు