రామోజీకి రాజమౌళికి ఇది వివాదం, ఇదే సాక్ష్యం       2018-06-08   23:19:27  IST  Raghu V

టాలీవుడ్‌ స్థాయిని అమాంతం హాలీవుడ్‌ రేంజ్‌కు తీసుకు వెళ్లిన దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం వివాదంలో చిక్కుకున్నాడు. ఈయన తన ‘బాహుబలి’ చిత్రాన్ని ఎక్కువ శాతం రామోజీ ఫిల్మ్‌ సిటీలో తెరకెక్కించాడు. భారీ అంచనాల నడుమ రూపొందిన ఆ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాను తాను ఇంత భారీ ఎత్తున చేపట్టి పూర్తి చేయడంకు ప్రధానంగా రామోజీ ఫిల్మ్‌ సిటీ కారణం అని, రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఉన్న ఏర్పాట్లు అద్బుతం అని, రామోజీ ఫిల్మ్‌ సిటీ లేకుంటే తాను ఇంతటి అద్బుత చిత్రాన్ని తెరకెక్కించి ఉండేవాడిని కాదు అంటూ రాజమౌళి పలు సందర్బాల్లో చెప్పుకొచ్చాడు.

రామోజీ ఫిల్మ్‌ సిటీపై అంతగా అభిమానం చూపించిన రాజమౌళి ఆ సంస్థకు ఇవ్వాల్సిన మొత్తంను ఇవ్వలేదని తెలుస్తోంది. రామోజీ ఫిల్మ్‌ సిటీలో పలు సెట్టింగ్‌లు, ఇతరత్ర ఏర్పాట్లకు ఏకంగా 90 కోట్ల మేరకు బిల్లు అయ్యింది. రామోజీ రావుకు చెల్లించాల్సి ఆ మొత్తంలో ఎక్కువ శాతం చెల్లించలేదని, దాంతో రామోజీ రావు ప్రస్తుతం జక్కన్నపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. సినీ వర్గాల వారు ఈ విషయంను నిర్థారిస్తున్నారు. రామోజీ ఫిల్మ్‌ సిటీకి తాను ఎంత ఇవ్వాలో అంత ఇచ్చేశాను అని, ఇంకా ఇచ్చేది ఏమీ లేదు అంటూ దర్శకుడు రాజమౌళి సన్నిహితుల వద్ద చెబుతున్నాడు. ఇలా ఇద్దరి మద్య వార్‌ జరుగుతుంది.

తాజాగా ఈ విషయమై నిర్మాత శోభుయార్లగడ్డ స్పందిస్తూ, మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని, అసు అలాంటి చర్చలు, వివాదాలు లేవని చెప్పుకొచ్చాడు. నిర్మాత చెబుతున్న విషయంలో నిజం లేదని కొందరు సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ చేస్తున్నారు. వివాదం లేకుంటే జక్కన్న రామోజీ ఫిల్మ్‌ సిటీలో అడుగు పెట్టవద్దని ఎందుకు అనుకుంటున్నాడు. ఇకపై తాను ఏ సినిమా చేసినా కూడా రామోజీ ఫిల్మ్‌ సిటీలో చేయవద్దని నిర్ణయించుకున్నాడట. ఈ విషయాన్ని ఆయన శిష్యులు అనధికారికంగా సన్నిహితుల వద్ద చెబుతున్నారట.

రామోజీ ఫిల్మ్‌ సిటీ వద్దనుకున్న రాజమౌళి తన తదుపరి చిత్రం కోసం హైదరాబాద్‌ శివారులో ఉన్న అల్యూమీనియం ఫ్యాక్టరీలో భారీ ఎత్తున సెట్టింగ్స్‌ను నిర్మిస్తున్నాడు. ఎక్కువ శాతం ఔట్‌ డోర్‌ షూటింగ్‌లు జరుపుకునే అల్యూమీనియం ఫ్యాక్టరీలో ఎక్కువ భాగం రెండు సంవత్సరాలకు గాను లీజ్‌కు తీసుకున్నాడట. ప్రస్తుతం అక్కడ శిబు సారిల్‌ సెట్స్‌ను నిర్మిస్తున్నాడు.

ఇకపై రామోజీ ఫిల్మ్‌ సిటీలో కాకుండా బయట మాత్రమే సినిమాలు తీయాలని జక్కన్న నిర్ణయించుకున్నాడు కనుక, రామోజీ రావు, రాజమౌళిల మద్య విభేదాలు ఉన్నట్లే అని, ఇదే సాక్ష్యం అంటూ సోషల్‌ మీడియాలో కొందరు పోస్ట్‌ు చేస్తున్నారు.