చైతూ, సమంతల మద్య విభేదాలు?       2018-05-04   00:17:42  IST  Raghu V

టాలీవుడ్‌ మోస్ట్‌ బ్యూటీఫుల్‌ కపుల్‌గా పేరు తెచ్చుకున్న అక్కినేని నాగచైతన్య మరియు సమంతల గురించి ప్రస్తుతం తెలుగు మీడియాలో ప్రతి రోజు ఏదో ఒక కథనం వస్తూనే ఉంది. వీరిద్దరు లైఫ్‌ను ఎంతగా ఎంజాయ్‌ చేస్తున్నారో వారి సోషల్‌ మీడియా పేజ్‌లను ఫాలో అయ్యే వారికి తెలుస్తుంది. విదేశాల్లో టూర్‌లు, హాలీడే స్పాట్‌లు ఇంకా ఎన్నో రకాలుగా వీరిద్దరు ఎంజాయ్‌ చేస్తూ ఉన్నారు. సమంత కోసం నాగచైతన్య వంట చేయడం, చైతూకు సమంత గిఫ్ట్‌లు ఇవ్వడం ఇలా పలు రకాలుగా సోషల్‌ మీడియాలో చూస్తూనే ఉన్నాం. వీరిద్దరి అన్యోన్యం ఇలాగే ఉండాని, ఇద్దరి జీవితం సంతోషంగా ఉండాలనేది అక్కినేని ఫ్యాన్స్‌ కోరిక.

వీరి వివాహ జీవితం మొదలై సంవత్సరం కావస్తున్న సమయంలో సమంత ఒక తమిళ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ సమయంలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నాగచైతన్య గురించిన కొన్ని విషయాలను చెప్పి అందరికి ఆశ్చర్యం కలిగింది. తమ జీవితం కూడా అందరి జీవితాల మాదిరిగానే సాగుతుందని, సంతోషంతో పాటు అప్పుడప్పుడు గిల్లి కజ్జాలు కూడా మా మద్య ఉంటాయని ఈ సందర్బంగా సమంత చెప్పుకొచ్చింది. సమంత ప్రస్తుతం పలు తెలుగు మరియు తమిళ చిత్రాల్లో నటిస్తున్న విషయం తెల్సిందే. ఒక తమిళ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా మీడియాతో మాట్లాడిన సమంత తన భర్తపై ప్రశంసలు కురిపించింది.

తాజాగా ఈమె ‘రంగస్థలం’ చిత్రంలో నటించిన విషయం తెల్సిందే. ఆ చిత్రం షూటింగ్‌ సమయం పాత్ర గురించి తన భర్త చైతూ ఎప్పుడు అడగలేదు. ఒక పల్లెటూరు అమ్మాయిగా అంటే నవ్వేసేవాడు. కాని సినిమా చూసిన తర్వాత నన్ను గట్టిగా హత్తుకుని మద్దు పెట్టుకున్నాడు అంటూ సమంత చెప్పుకొచ్చింది. కొన్ని సందర్బాల్లో చైతూ చిరాకు పడతాడు. చైతూను ఆట పట్టించేందుకు ఆయన చిరాకు పెట్టేలా ప్రవర్తిస్తాను.

అప్పుడు చైతూ చిరాకుగా మొహం పెట్టినప్పుడు మళ్లీ నవ్విస్తాను అంటూ సమంత చెప్పుకొచ్చింది. ఇద్దరి మద్య చిన్న విషయాలకు కూడా అప్పుడప్పుడు గొడవ పడతాం అని, కాని కొన్ని గంటల వ్యవధిలోనే కలిసి పోతాం అంటూ చెప్పుకొచ్చింది. ఒక వేళ గొడవపడి బయటకు వెళ్లినా కూడా ఫోన్‌లో ఛాటింగ్‌ చేస్తూ చైతూను కూల్‌ చేసేందుకు ప్రయత్నిస్తాను.

ఏది ఏమైనా కూడా చైతూతో జీవితాన్ని పంచుకోవడం గొప్ప అనుభూతిని ఇస్తుందని, ఇద్దరం కూడా ప్రస్తుతం జీవితాన్ని ఆస్వాదిస్తూ, భార్య భర్తలుగా అన్ని రకాలుగా అనుభూతులను ఆస్వాదిస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం వీరిద్దరు కలిసి శివ నిర్వాన దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న ఈ చిత్రం షూటింగ్‌ త్వరలో ప్రారంభం కాబోతుంది.