మణిశర్మ ముందు దేవిశ్రీప్రసాద్ దండగేనా?     2016-12-31   00:54:19  IST  Raghu V

2001వ సంవత్సరం సంక్రాంతి సీజన్. మృగరాజు, నరసింహానాయుడు, దేవిపుత్రుడు అనే మూడు సినిమాలు విడుదలయ్యాయి పండక్కి. ఇప్పుడు ఆ సినిమాల ఫలితాల గురించి ఎందుకు కాని, ఆ మూడు సినిమాల్లో ఓ కామన్ విషయం ఉంది. అదేంటంటే, ఆ మూడు సినిమాలకి మణిశర్మ సంగీతం అందించారు.

మూడు సినిమాల ఆల్బమ్స్ సూపర్ హిట్స్. ఇక నేపథ్య సంగీతం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒకే సమయంలో అయిదారు సినిమాలు చేతిలో పెట్టుకోని కూడా, అన్ని సినిమాలకి బంపర్ మ్యూజిక్ ఇవ్వడం మణిశర్మ గొప్పతనం. మరి ఈ తరం సంగీత దర్శకులు దేవిశ్రీప్రసాద్, తమన్ అలా ఎందుకు పనిచేయలేకపోతున్నారు?

దేవిశ్రీప్రసాద్ ఇప్పటివరకైతే ఖైదీ నం.150 విషయంలో అభిమానుల్ని కూడా పెద్దగా ఆకట్టుకున్నది లేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మీద ఫ్యాన్స్ ఆశలు వదులేసుకోవడం బాధాకరం. మరో విషయం ఏమిటంటే, గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా వదిలేసుకోని, కేవలం ఖైదీనం 150 కి సంగీతం అందించాడు దేవి. ఎందుకు అంటే, ఒకేసారి పోటిలో వస్తున్న రెండు పెద్ద సినిమాలకి పనిచేయడం తన వల్ల కాదంట.

మరి సంక్రాంతి పోటికి వచ్చిన మూడు పెద్ద సినిమాలకి ఒకేసారి అద్భుతమైన సంగీతం అందించిన మణిశర్మలో ఉన్నది ఏంటి? దేవిశ్రీప్రసాద్ లో కరువైనది ఏంటి ?