చిరంజీవి అందరివాడవుతాడా.. కొందరివాడవుతాడా..?

Chiru Maa controversy : తెలుగు చిత్ర పరిశ్రమలలో ఎలాంటి విభేదాలు లేవు.మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అంతా ఒకే కుటుంబం.

 Difference Between Maa And Chiranjeevi Details, Chiranjeevi, Megastar Chiranjeev-TeluguStop.com

ఇందులో గ్రూపు రాజకీయాలకు తావులేదంటూ ఇన్నిరోజులుగా సినీ పెద్దలు మాట్లాడుతూ వచ్చారు.కానీ, మా ఎలక్షన్స్‌తో అందులో విభేదాలు, గ్రూపు రాజకీయాలు నిజమేనని బట్టబయటైంది.

ఒకానొక సందర్భంలో మా లో పెద్దరికాలు, పెద్దలు అంటూ ఎవరూ లేరని మంచు మోహన్ బాబు ఓ ఇంటర్వ్యూలో స్పష్టంచేశారు.చిరంజీవి, మోహన్ బాబు అందరిలో కౌగిలించుకుని ముద్దులు కూడా పెట్టకున్నారు.

అప్పుడు నిజంగానే మా లో ఎలాంటి లుకలుకలు లేవని అందరూ అనుకున్నారు.కానీ, మొన్న జరిగిన మా ఎన్నికల్లో అవన్నీ బూటకమే అని మరోసారి స్పష్టమైంది.

ఇకపోతే చిరంజీవి చాలా సార్లు తాను ఏ వర్గానికి కొమ్ముకాయనని, చిత్ర పరిశ్రమలోని వారంతా తనవాళ్లే అని పదే పదే చెప్పుకుంటూ వచ్చారు.తాను అందరివాడిని అని, కొందరివాడిని కాదన్నారు.

వాస్తవానికి చిరు ఎపుడూ ఒక వర్గానికి కొమ్ము కాయలేదు.ఆయన వద్దకు ఎవరు వెళ్ళినా స్వాగతించారు.

ఇటీవల మా ఎన్నికల టైంలో ప్రకాష్ రాజ్ ప్యానల్‌కు చిరంజీవి మద్దతు ఇచ్చారంటూ జోరుగా ప్రచారం జరిగింది.మెగా బ్రదర్ నాగబాబు మీడియాతో మాట్లాడిన అనంతరం.

మా ఎన్నికలు చిరు వర్సెస్ మంచు ఫ్యామిలీ అన్నట్టుగానే సాగాయి.చివరికు మంచు విష్ణు అధ్యక్షుడిగా గెలవడం, నాగబాబు తన మా సభ్యత్వానికి రాజీనామా చేయడంతో వివాదం ఇంకా ముదిరింది.

Telugu Chiranjeevi, Maa, Manchu, Manchu Vishnu, Mohan Babu, Prakash Raj-Movie

కాగా, విష్ణు ప్రమాణ స్వీకారానికి చిరు ఫ్యామిలీ నుంచి ఎవరూ రాలేదు.ఆ టైంలో మంచు విష్ణు మెగా ఫ్యామిలీని పిలిచారా లేదా అన్న దానిపై మీద కూడా జోరుగా చర్చలు జరిగాయి.ఇవన్నీచూశాక మా ఎన్నికలు నిజంగానే చీలిక తెచ్చిందని.త్వరలోనే చిత్ర పరిశ్రమ రెండుగా విడిపోనుందని.అందులో ఒకటి చిరంజీవి వర్గం, మరోకటి మంచు మోహన్ వర్గం అని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇకపోతే చిరంజీవి చిత్రపరిశ్రమకు పెద్దగా అనేక కార్యక్రమాలు చేశారు.

ఆ టైంలో మంచు మోహన్ బాబు ఎక్కడా కనిపించలేదు.

Telugu Chiranjeevi, Maa, Manchu, Manchu Vishnu, Mohan Babu, Prakash Raj-Movie

ఇపుడు విష్ణు ప్రమాణ స్వీకారానికి మెగా ఫ్యామిలీ రాలేదు.కానీ, రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ విచ్చేశారు.అంతటితో ఆగకుండా మోహన్ బాబును ప్రశంసల జల్లులు కురిపించారు.

తాము అన్నదమ్ములమని కూడా చెప్పుకొచ్చారు.విష్ణు మా అధ్యక్షుడిగా మంచి నాయకుడు అవుతాడన్నారు.

మొత్తానికి మంచు ప్యానెల్‌కు ప్రభుత్వం మద్దతు ఉంటుందని చెప్పకనే చెప్పారు.ఈ పరిణామాలన్నీ చూస్తే ఇకనైనా మెగాస్టార్ కూడా కొందరివాడుగా మిగిలిపోకుండా ఉండాలంటే అందరినీ కలుపుకుని పోవాలి.

లేదంటే ఆయన్ను కొందరివాడుగానే ప్రచారం చేసి మా లో ఆయన ప్రాబల్యం తగ్గిపోయే అవకాశం లేకపోలేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube