గీత గోవిందం... ‘నోటా’ వసూళ్ల మధ్య ఎంత తేడా ఉందో చూడండి!  

Difference Between Geetha Govindam And Nota Movie-

Vijay Devarakonda is the hero of the film 'Noatta' has come up with fresh audiences. The 'Nota' box office was released before the massive expectations. Vijay Devarakonda's 'Geeta Govindam' is a blockbuster hit, and it is expected that the 'Noata' film will have huge openings with good openings. But this film was a flop. Vijay Devarakonda was not expecting a flip after Geeta Govindam in such a short gap.

.

'Geeta Govindam' movie is still playing in theaters, but the recent note has been ready to go. 'Geeta Govindham' grossed Rs 31.65 crore in its first weekend. Only Vijay Devarakonda was in the Nizam area of 8.7 crore. But in the recent week, the only non-banking film got only 11.5 crore shares in the first weekend. Geeta Govindam film collections have a lot of difference to the nota collections. The collections have been dropped from the second day due to the film flap talk. .

Vijay Devarakonda did not get good gains for 'Noata' with his craze on the first day. But the director Anand Shankar failed to impress the film due to the screenplay and screenplay. The collections are worse in this range. The 'Noida' screened with a budget of just 13 crores. So the producer is safe and gets information. Producer Gnanavel Raja kept the film untold to sell the theatrical rites with the intention of gaining all the benefits of the film. This film was sold for more than 30 crores if Gnanelve Raja sold it. Then there are about 15 crore damages to distributors. But producer Gnanavel Raja has a huge profit, say trade groups.

విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన చిత్రం ‘నోటా’ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ‘నోటా’ బాక్సాఫీస్‌ ముందు బొక్క బోర్లా పడినది. ఈ చిత్రంకు ముందు విజయ్‌ దేవరకొండ నటించిన ‘గీత గోవిందం’ చిత్రం బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అయిన కారణంగా ‘నోటా’ చిత్రానికి భారీ ఓపెనింగ్స్‌తో పాటు మంచి వసూళ్లు వస్తాయని అంతా ఊహించారు...

గీత గోవిందం... ‘నోటా’ వసూళ్ల మధ్య ఎంత తేడా ఉందో చూడండి!-Difference Between Geetha Govindam And Nota Movie

కాని అనూహ్యంగా ఈ చిత్రం ఫ్లాప్‌గా నిలిచింది. విజయ్‌ దేవరకొండకు ఇంత షార్ట్‌ గ్యాప్‌లో గీత గోవిందం తర్వాత ఫ్లాప్‌ వస్తుందని ఎవరు ఊహించలేదు.

‘గీత గోవిందం’ చిత్రం ఇంకా థియేటర్‌లలో ఆడుతూనే ఉంది, కాని ఇటీవల వచ్చిన నోటా మాత్రం వెళ్లిపోయేందుకు సిద్దం అయ్యింది. ‘గీత గోవిందం’ చిత్రం మొదటి వారాంతంలో 31.65 కోట్ల వసూళ్లను సాధించింది. కేవలం నైజాం ఏరియాలోనే 8.7 కోట్లను విజయ్‌ దేవరకొండ రాబట్టాడు. కాని తాజాగా నోటా చిత్రం మాత్రం మొదటి వారాంతంలో కేవలం 11.5 కోట్ల షేర్‌ను మాత్రమే రాబట్టింది. గీత గోవిందం చిత్రం కలెక్షన్స్‌కు నోటా కలెక్షన్స్‌కు చాలా తేడా ఉన్నాయి.

సినిమా ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకున్న కారణంగా రెండవ రోజు నుండే కలెక్షన్స్‌ డ్రాప్‌ అయ్యాయి..

మొదటి రోజు తనకున్న క్రేజ్‌తో విజయ్‌ దేవరకొండ ‘నోటా’కు మంచి వసూళ్లను రాబట్టలేక పోయాడు. కాని దర్శకుడు ఆనంద్‌ శంకర్‌ మూస కథ, స్క్రీన్‌ప్లేతో చిత్రాన్ని తెరకెక్కించిన కారణంగా సినిమా ఆకట్టుకోవడంలో విఫలం అయ్యింది. దాంతో కలెక్షన్స్‌ ఈ రేంజ్‌లో దారుణంగా ఉన్నాయి.

‘నోటా’ చిత్రాన్ని కేవలం 13 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. కనుక నిర్మాత సేఫ్‌ అంటూ సమాచారం అందుతుంది. ఈ చిత్రం మొత్తం లాభాలను తానే దక్కించుకోవాలనే ఉద్దేవ్యంతో నిర్మాత జ్ఞానవేల్‌ రాజా ఈ చిత్రం థియేట్రికల్‌ రైట్స్‌ను అమ్మకుండా తనవద్దే ఉంచుకున్నాడు...

ఈ చిత్రంను కనుక జ్ఞానవేల్‌ రాజా అమ్మి ఉంటే ఖచ్చితంగా 30 కోట్లకు పైగా అమ్ముడు పోయేది. అప్పుడు డిస్ట్రిబ్యూటర్లకు దాదాపుగా 15 కోట్ల నష్టాు వచ్చేవి. కాని నిర్మాత జ్ఞానవేల్‌ రాజాకు మాత్రం భారీగా లాభాలు దక్కేవి అంటూ ట్రేడ్‌ వర్గాల వారు అంటున్నారు.