పవన్ చిరు మధ్య ఇంత తేడా ఎందుకు ?

బంధాలు, బంధుత్వాలు ఇంటి వరకే పరిమితం.రాజకీయాలకు వాటిని ఆపాదించడం సరికాదు.

 Difference Between Chiranjeevi And Pawan Kalyan-TeluguStop.com

రాజకీయాల్లో ఎవరి దారులు వారికి ఉంటాయి.ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు రాజకీయం చేసుకుంటారు.

అయితే సమాజం మాత్రం దానికి ఒప్పుకోదు.రాజకీయాన్ని కుటుంబాన్ని ఓకే కోవలో చూస్తూ భూతద్దం పెట్టి మరి తేడాలను పీల్చుతుంది.

ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జీవితాలను కూడా ఇదే విధంగా చూస్తోంది.చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చి ఆ తరువాత రాజకీయాల్లో ఇమడలేక పార్టీని కాంగ్రెస్ లో కలిపేసి సైలెంట్ గా ఉంటున్నారు.

కానీ అదే సమయంలో ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టారు.రాజకీయంగా తాను ఎదిగేందుకు అందరితోనూ గిల్లి కజ్జాలు పెట్టుకుంటున్నారు.

Telugu Chiranjeevimeet, Janasenapawan, Pawan Jagan-

లేనిపోని నిందలు, విమర్శలు మీద వేసుకుంటున్నారు.పోనీ రాజకీయంగా పవన్ సాధించింది ఏమైనా ఉందా అంటే ? మొన్న జరిగిన ఎన్నికల్లో తాను ఓడిపోవడమే కాకుండా కేవలం ఒకే ఒక్క సీటు తన పార్టీ గెలుచుకునే అంత రేంజ్ లో పవన్ వ్యవహారం నడిచింది.ఈ ఫలితాలతో రాజకీయాల్లో పవన్ రేంజ్ ఏంటో అందరికీ అర్థమైపోయింది.కానీ పవన్ మాత్రం సైలెంట్ అవ్వలేదు.మరింతగా తన రాజకీయ మాటల బాణాలకు పదును పెట్టి మరి అధికార పార్టీ మీదకు వదులుతూనే ఉన్నారు.ఇక్కడో మాట అక్కడో మాట చెబుతూ తాను కన్ఫ్యూజ్ అవడమే కాకుండా అందర్నీ మరింత కన్ఫ్యూజ్ చేస్తున్నాడు.

కానీ ఈ వ్యవహారం ఇలా సాగుతుండగానే పవన్ అన్నయ్య చిరంజీవి వైసీపీ అధినేత జగన్ తో సన్నిహితంగా ఉండడమే కాకుండా, ఆయన గొప్ప ముఖ్యమంత్రి అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నాడు.

Telugu Chiranjeevimeet, Janasenapawan, Pawan Jagan-

మొన్నా మధ్య విజయవాడ వెళ్లి మరి జగన్ ను కలిసి కలిసిన చిరంజీవి జగన్ చాలా మంచి వ్యక్తి, ఆంధ్ర ప్రదేశ్ బాగా అభివృద్ధి చేసే ఆలోచనతో ఉన్నారని, ఖచ్చితంగా అలా చేస్తారంటూ చెప్పారు.మా డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటూ చిరంజీవి ఆత్మీయంగా మాట్లాడారు.విశాఖలో సినీ ఇండస్ట్రీ అభివృద్ధి గురించి పరుచూరి మాట్లాడుతుండగా చిరంజీవి మైక్ తీసుకుని సైరా రిలీజ్ సందర్భంగా ముఖ్యమంత్రితో జరిగిన తన భేటీ వివరాలను బయటపెట్టారు.

నేను జగన్ ను కలిసిన తర్వాత ‘మీరు చెప్పండి అన్నా, మీరు ఏది చెబితే అది’ అంటూ మర్యాదగా జగన్ తనతో మాట్లాడారని, మీరంతా ఒక మాట అనుకుని రండి అని చెప్పారు.

అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సినీ ఇండస్ట్రీ అంటే ఎంతో ప్రేమ చూపిస్తున్నారు అంటూ చిరంజీవి మెచ్చుకున్నారు.

చిరంజీవి జగన్ ను ఆ విధంగా పొగుడుతుంటే పవన్ మాత్రం ఆయన పేరును కూడా వాడేందుకు ఇష్టపడడం లేదు.కులం పేరుతో ఆయన పేరు కలిపి జగన్ రెడ్డి అంటూ అపహాస్యం చేసే పనిలో ఉన్నారు.

దీంతో చిరు, పవన్ వ్యక్తిత్వాలపై పెద్ద ఎత్తున ప్రజల్లో చర్చ జరుగుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube