డైటింగ్ చేసే వారు కామన్ గా చేసే తప్పులు ...ఏమిటో తెలుసుకుంటే తొందరగా సన్నబడవచ్చు

ఈ రోజుల్లో బరువు ఎక్కువ ఉన్న వారు తగ్గించుకోవటానికి మరియు సమాన బరువు ఉన్నవారు ఇంకా పెరగకుండా ఉండటానికి అనేక పాట్లు పడుతూ ఉంటారు.విపరీతమైన వ్యాయామాలు చేయటం, డైటింగ్ చేయటం వంటివి యమా సీరియస్ గా చేసేస్తూ ఉంటారు.

 Dieting Mistakes You Must Avoid-TeluguStop.com

డైటింగ్ అంటే పూర్తిగా తిండి మానేయటం కాదు.అసలు డైటింగ్ అంటే తిండి ఎప్పుడు ఎంత తినాలి ఎంత సేపు వ్యాయామం చేయాలి అనే చెప్పేది.

అయితే చాలా మంది డైటింగ్ పేరుతొ చాలా తప్పులు చేసేస్తున్నారు.ఆ తప్పులు గురించి తెలుసుకుందాం.

డైటింగ్ ఎక్కువగా చేయటం
తక్కువ ఆహారం తీసుకోని ఎక్కువ డైటింగ్ చేస్తే సన్నపడటం అటు ఉంచి ఎక్కువ లావు అయ్యే అవకాశం ఉంది.


వ్యాయామం ఎక్కువగా చేయటం
బరువు తగ్గాలనే తొందరలో ఎక్కువగా వ్యాయామం చేసేస్తూ ఉంటారు.ఎక్కువ వ్యాయామం చేయటం వలన అలసట,నీరసం వంటివి వస్తాయి.లెక్క ప్రకారం ఒక వారంలో ఒక కేజీ బరువు తగ్గితే మంచిది.

ఫుడ్ స‌ప్లిమెంట్లు
ఫుడ్ స‌ప్లిమెంట్లు బరువు తగ్గటంలో సహాయపడతాయి.కానీ ఆరోగ్యానికి మంచిది కాదు.

భోజనం సరిగ్గా తినాలి
భోజనం చేయటం అసలు మానకూడదు.భోజనం తినాలని అన్పించనప్పుడు కొంచెం కొంచెంగా రెండు మూడు సార్లు తినాలి.

ఇలా తినటం వలన బరువు అదుపులో ఉంటుంది.ఒక పూట భోజనం మానేస్తే మరో పుట భోజనం చేసినప్పుడు ఎక్కువగా తినేస్తాం.

దాంతో బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.నిద్ర
ప్రతి రోజు తప్పనిసరిగా 6 నుంచి 8 గంటల నిద్ర అవసరం.

సరైన నిద్ర లేకపోతే ఎంత డైటింగ్ చేసిన ఉపయోగం ఉండదు.ఎందుకంటే సరైన నిద్ర లేకపోతే ఆ ప్రభావం జీవక్రియల మీద పడుతుంది.

టీ, కాఫీ లు మానేయాలి
టీ, కాఫీ లు మానేసి సహజసిద్ధమైన జ్యుస్ లను త్రాగాలి.

చక్కర,కొవ్వులు మానేస్తారు
బరువు తొందరగా తగ్గాలని ఆత్రుతతో చక్కర,కొవ్వులు మానేస్తారు.

అయితే అవి కూడా శరీరానికి సరైన మోతాదులో అవసరమే.వాటిని పూర్తిగా మానేయకుండా తక్కువ మోతాదులో తీసుకోవాలి.

నీరు
ప్రతి రోజు 7 గ్లాసుల మంచి నీటిని తప్పనిసరిగా త్రాగాలి.శరీరానికి సరైన మోతాదులో నీరు అందకపోతే జీవ‌క్రియ‌ల‌పై ప్ర‌భావం చూపి డీహైడ్రేష‌న్‌, అజీర్ణం, మ‌ల‌బ‌ద్ద‌కం వంటి సమస్యలు ఏర్పడతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube