స్లిమ్ అవ్వలేదు న్యాయం చేయండి: మహిళకు షాకిచ్చిన కోర్టు

గతంతో పోలీస్తే ఈ మధ్యకాలంలో పిల్లల నుంచి పెద్దవారి దాకా ఆరోగ్యంగా స్పృహ బాగా పెరిగింది.వీటన్నింటిలో ఎక్కువగా ఆలోచిస్తోంది అధిక బరువు గురించే.

 Diet Soda May Not Lead Weight Loss Says California-TeluguStop.com

తాజాగా ఓ మహిళ ఓ కంపెనీ చెప్పిన మాటలు నమ్మి బరువు తగ్గేందుకు డైట్ ప్రోడక్ట్ వాడింది.కానీ ఎటువంటి ఫలితం లేకపోవడంతో చివరికి కోర్టు మెట్లెక్కింది.

వివరాల్లోకి వెళితే.అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రానికి షానా బాసెరా అనే మహిళ…తీవ్ర స్థాయిలో ఊబకాయంతో బాధపడుతోంది.ఈ నేపథ్యంలో బరువు తగ్గేందుకు గాను ప్రముఖ కంపెనీ డా.పెప్పర్‌కు చెందిన వాణిజ్య ప్రకటన చూసి 13 ఏళ్ల క్రితం సోడా డైట్ డ్రింక్‌ను ప్రతి రోజూ వాడటం మొదలుపెట్టింది.ఏళ్లు గడుస్తున్నా కానీ ఆమె బరువులో మాత్రం కొంచెం కూడా తేడా రాలేదు.బాసెరాలో సహనం నశించి సదరు కంపెనీపై ఏకంగా కోర్టుకెక్కింది.సోడా డైట్ తనను తప్పుదారి పట్టించిందని ఆరోపించింది.

Telugu Calinia, Diet Soda, Telugu Nri Ups-

అయితే న్యాయస్థానంలో ఆమెకు దిమ్మతిరిగే తీర్పు వచ్చింది.మీరు తాగుతున్న సోడా డ్రింక్‌ను డా.పెప్పర్ కంపెనీ డైట్‌గా పేర్కొందే కానీ ఎక్కడా వెయిట్ లాస్ అని పేర్కొంది.దీనిని వినియోగదారులు తప్పుగా అర్థం చేసుకున్నారు తప్పిచి కంపెనీ మాత్రం వారిని ఎక్కడా మోసం చేయలేదని వెల్లడించింది.డైట్ అంటే సాధారణ ఉత్పత్తుల కన్నా తక్కువ కేలరీలు కలిగి ఉండటమని న్యాయస్థానం మొట్టికాయలు వేసింది.

వాణిజ్య ప్రకటనల్లో కనిపించేవాళ్లు అందంగా, స్లిమ్‌గా ఉన్నంత మాత్రాన వినియోగదారులు కూడా అలాగే మారుతారని కాదని చెబుతూ బాసెరా వేసిన పిట్టిషన్‌‌ను కొట్టివేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube