ప్రభుత్వం వాహనదారులకు శుభవార్త అందించింది.నాలుగు నెలల లాక్ డౌన్ పూర్తయిన తర్వాత అన్ లాక్ ప్రక్రియ ప్రారంభమైంది.
దీంతో దేశ వ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధర రోజూ గణనీయంగా పెరుగుతూ వచ్చాయి.లాక్ డౌన్ లో ఉపాధి కోల్పోయి ఉన్న సామాన్య ప్రజలకు తమ వాహనాలు బయటకు తీయడానికి ఇబ్బందిగా మారింది.
తాజాగా ఓ ప్రభుత్వం వాహనాదారులకు గుడ్ న్యూస్ అందించింది.ఇది కేంద్ర ప్రభుత్వం అనుకునేరు లేదా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుకునేరు అది ఢిల్లీ ప్రభుత్వం.
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించింది.
ఢిల్లీలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం వాహనదారులకు సంతోషకరమైన విషయం తెలిపింది.డీజిల్ పై వ్యాట్ ను తగ్గిస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది.దీంతో డీజిల్ ధర ఏకంగా రూ.8కి దిగి వచ్చింది.ఈ ధరలు రేపటి నుంచి అమలులోకి వస్తుందని ఢిల్లీ సర్కార్ గురువారం సాయంత్రం వెల్లడించింది.డీజిల్ వ్యాట్ పై 30 శాతం నుంచి 16.75 శాతానికి తగ్గించేందుకు కేబినేట్ ఆమోద ముద్ర వేసింది.
దీంతో రేపటి నుంచి డీజిల్ ధరలు కొత్త ధరలో అమలులోకి వస్తుందని క్రేజీవాల్ ప్రభుత్వం ప్రకటించింది.అయితే ప్రస్తుతం ఢిల్లీలో డీజిల్ ధర లీటర్ కు రూ.81.94 గా ఉంటే రేపటి నుంచి వ్యాట్ అమలుతో ధర లీటర్ కు రూ.73.94 గా ఉండనుంది.డీజిల్ ధర తగ్గుదలతో సామాన్యులకు కొంచెం ఊరట లభించనుంది.