చనిపోయిన వ్యక్తి తిరిగొస్తే..?!

సృష్టిలోని ప్రతి జీవికి పుట్టుక ఎలాగో మరణం కూడా అలాగే సంభవిస్తుందని మన అందరికి తెలిసిందే.అయితే చనిపోయాడు అని అనుకున్న వ్యక్తి మరల తిరిగి కనిపిస్తే అమ్మో దెయ్యం అయ్యి తిరిగి వచ్చాడు అనుకుని బెంబేలెత్తి పోతాము కదా.

 Died Person Gangaram Came Back In Mullangi Village Strange Incident, Died Person-TeluguStop.com

సరిగ్గా ఇక్కడ అలాంటి ఒక ఘటనే జరిగింది.చనిపోయాడని అనుకున్న వ్యక్తి మూడు నెలల తరువాత తిరిగి కనిపిస్తే.? అతడిని చూసిన ప్రజల పరిస్థితి ఏంటి అని ఒక్కసారి ఆలోచించి చూడండి.సరిగ్గా ఆ వ్యక్తిని చూసి మనం అందరం ఎలా బయపడిపోతామో ఆ వ్యక్తిని చూసి ఆ గ్రామస్తులు కూడా అలాగే అవాక్కయ్యారు.

ఈ ఘటన ఆర్మూర్ నియోజకవర్గం పరిధిలోని మాక్లూర్ మండలం ముల్లంగి (బి) లో చోటు చేసుకుంది.చనిపోయిన వ్యక్తి బతికి వచ్చాడనే ఘటనతో ముల్లంగి (బి) పేరు ఇప్పుడు ఫేమస్ అయింది.

అసలు చనిపోయిన వ్యక్తి నిజంగానే తిరిగి వచ్చాడా.? లేక అతను చనిపోలేదా.? ఊరి ప్రజలు ఎందుకు అతన్ని చనిపోయాడని అనుకుంటున్నారు.? అనే మీ ప్రశ్నలకు జవాబు దొరకాలంటే జరిగింది ఏంటో ఒక్కసారి చూద్దాం.

గ్రామస్తులంతా చనిపోయాడు అని అనుకుంటున్న ఆ వ్యక్తి పేరు గంగారాం. ఇతను నిర్మల్ జిల్లాలోని భైంసా సమీపంలోని ఓ గ్రామానికి చెందిన వృద్ధుడు.అయితే ముల్లంగి (బి)లో పడమటి గంగారాంగా ఈ వ్యక్తి అందరికి తెలుసు.ఇతనికి బంధువులు ఎవరు లేకపోవడంతో ఆలయాలు, ఆశ్రమాల చుట్టు బిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.

అంతేకాకుండా ముల్లంగి (బి) గ్రామ పంచాయతీ కార్యాలయంలో గంగారాంకు వృద్ధాప్య పింఛన్ కూడా వస్తుంది.ఇలా ప్రతినెలా పింఛన్ తీసుకుంటూ యాచన చేస్తూ గ్రామస్తులు పెట్టింది తింటూ జీవనం కొనసాగిస్తున్నాడు.

కాగా ఒక మూడు నెలల కిందట ముల్లంగి (బి) గ్రామంలో ఓ రోడ్డు ప్రమాదంలో పడమటి గంగారాంకు తీవ్రంగా గాయాలు అయ్యాయి.అతని తరపు బంధువులు ఎవరూ లేకపోవడంతో అక్కడ స్థానిక సర్పంచ్ భర్త శ్యామ్ రావు 108 అంబులెన్స్ లో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తీసుకుని వెళ్ళారు.

అప్పటికే తీవ్ర గాయాలతో ఉన్న వృద్ధున్ని చూసిన వైద్యులు గంగారాం పరిస్థితి సీరియస్ గా ఉందని సర్పంచ్ భర్తకి చెప్పడంతో అతను ఒక అనాథ అని ఎవరు లేరని చెప్పి సర్పంచ్ భర్త హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేశారు.

Telugu Person, Person Gangaram, Mullangi, Sarpanch, Strange, Latest-Latest News

ఆ తరువాత అతను ఏమయ్యాడో ఎవరికీ తెలియదు.అయితే దాదాపు మూడు నెలల తర్వాత ఈ నెల 8వ తేదీ శుక్రవారం ఓ ఆటోలోనుంచి ఓ వృద్ధుడు దిగి సరాసరి ముల్లంగి (బి) జీపీ సెక్రెటరీ అయిన రాధిక వద్దకు వెళ్ళి తన పేరు గంగారాం అని గత మూడు నెలలుగా తాను పింఛన్ తీసుకోలేదని తనకు ఆ డబ్బులు ఇవ్వాలని అడిగాడు.గంగారాం అనే పేరు వినగానే జీపీ సెక్రటరీ గుండె ఒక్కసారిగా ఆగినంత పని అయ్యి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది.

రంగంలోకి దిగిన పోలీసులు విచారణ మళ్ళీ మొదలుపెట్టరు అసలు యాక్సిడెంట్‌కు, గంగారాం రీ ఎంట్రీకి మధ్య ఏం జరిగింది అనే కోణంలో కేసును దర్యాప్తు చేయగా అసలు నిజం బయట పడింది.ముల్లంగిలో ఆ రోజు గుర్తు తెలియని వాహనం కారణంగా యాక్సిడెంట్ జరిగిన అప్పుడు ఆ వృద్ధున్ని కొట్టేసి వాహనం ఆపకుండా వెళ్లిపోవడాన్ని సీసీ పుటేజీల ఆధారంగా సేకరించారు.

Telugu Person, Person Gangaram, Mullangi, Sarpanch, Strange, Latest-Latest News

ఆ తరువాత గాయపడిన వ్యక్తి కోసం హాస్పిటల్ కి వెళ్లిన పోలీసులకు ఎన్ని వార్డులు వెతికిన ఆ వృద్ధుడు ఆచూకీ లభించలేదు.ఆ తరువాత మూడు నాలుగు సార్లు ముల్లంగి గ్రామాన్ని సందర్శించిన అతని ఆచూకీ లభించలేదు.సర్పంచ్ భర్తని ఆరాతీయగా ఆ వృధ్దిడి పరిస్థితి విషమంగా ఉందని అప్పుడు డాక్టర్ చెప్పాడని చెప్పడంతో అందరు గంగారాం చనిపోయాడని అనుకున్నారు.కొన్నాళ్ళకి అతని గురించి మర్చిపోయారు మళ్ళీ మూడు నెలలకు అతను రావడంతో అందరు అవాక్ అయ్యారు.

అధికారంగా అతను చనిపోయాడని రికార్డ్స్ లో ఎక్కకపోవడంతో అతని పేరు ఇంకా ఫించన్ లిస్ట్ లో ఉండడం అతని అదృష్టం అనే చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube