అల్లు అర్జున్ ని చూడటం కోసం అన్ని కిలోమీటర్లు పాదయాత్ర చేసిన అభిమాని

స్టార్ హీరోలని విపరీతంగా అభిమానించే హీరోలు ఉంటారు.అలాంటి అభిమానులు తమ అభిమాన హీరోని కలవడానికి ఎంత దూరం అయినా వెళ్తారు.

 Die-hard Fan Walks 250 Kilometres To Meet Allu Arjun, Celebrity Fans, Tollywood,-TeluguStop.com

ఏమైనా చేస్తారు.అలాగే అభిమాన హీరో ఒక్క మాట చెబితే ఆ మాట కోసం ఏదైనా చేయడానికి వెనుకాడరు.

అంతలా గుడ్డిగా హీరోలని ఫాలో అయ్యే అభిమానులు చాలా మంది ఉన్నారు.సౌత్ లో తెలుగు, తమిళ బాషలలో స్టార్ హీరోలకి ఈ రకమైన అభిమానులు ఎక్కువగా ఉంటారు.

ఇతర బాషలలో స్టార్ హీరోలైన వారిని సినిమాల వరకే చూస్తారు.కానీ తెలుగు, తమిళ బాషలలో హీరోలని అభిమానులు ఆరాధిస్తూ ఉంటారు.

తమ అభిమాన హీరోని ఎవరైనా ఏమైనా అంటే సహించలేని స్థాయిలో వారికి పిచ్చి ఉంటుంది.ఇలాంటి అభిమానంతో ఒక్కోసారి వారు పెద్ద పెద్ద సాహసాలు చేస్తూ ఉంటారు.

ఈ నేపధ్యంలో తాజాగా అల్లు అర్జున్ అభిమాని ఏకంగా మాచర్ల నుంచి హైదరాబాద్ కి బన్నీని చూడాలని నడుచుకొని వచ్చేశాడు.

గుంటూరు జిల్లా మాచర్ల నుండి హైదరాబాద్ కు కంభంపాడు నాగేశ్వరరావు అనే అల్లు అర్జున్ పాదయాత్ర చేశాడు.

సెప్టెంబర్ 17వ తారీకున మాచర్లలో పాదయాత్ర మొదలు పెట్టిన నాగేశ్వరరావు హైదరాబాద్ చేరుకునేందుకు ఆరు రోజుల సమయం తీసుకున్నాడు.గతంలో నాలుగు అయిదు సార్లు హైదరాబాద్ వచ్చి బన్నీని కలిసేందుకు ప్రయత్నించాడట.

కాని ఆ సమయంలో బన్నీ ని కలవడం వీలు పడలేదు.ఈసారి బన్నీని కలిసి ఒక ఫొటో తీసుకుని రెండు నిమిషాలు మాట్లాడిన తర్వాతే మాచర్ల వెళ్తాను అంటూ భీష్మించుకు కూర్చున్నాడు.

మీడియాలో ఇతడి గురించి కథనాలు వస్తున్న బన్నీని కలిసే అవకాశం దొరికనట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube