రేవంత్‌ను కోమ‌టిరెడ్డి లెక్క చేయ‌ట్లేదా.. వ‌ద్ద‌న్నా ఆ స‌మావేశానికి ఎందుకెళ్లిన‌ట్టు..

రేవంత్‌రెడ్డి టీపీసీసీ చీఫ్ అయిన‌ప్ప‌టి నుంచి కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి తీవ్ర అసంతృప్తిలోనే ఉంటున్నారు.ఏకంగా రేవంత్ పైనే తీవ్ర ఆరోప‌ణ‌లు కూడా చేశారు.

 Didn't Komatireddy Count Rewanth  Why Did He Go To That Meeting Komatireddy, Rev-TeluguStop.com

ఓటుకు నోటు లాగే టీపీసీసీని కూడా కొనుక్కున్నారంటూ ఆరోపించారు.అంతే కాదు తాను గాంధీ భ‌వ‌న్ మెట్లు ఎక్క‌బోనంటూ ప్ర‌క‌టించారు.

ఇక రేవంత్ కూడా త‌న‌ను క‌ల‌వొద్ద‌ని త‌న‌కు ఇష్టం లేదంటూ చెప్పుకొచ్చారు.ఈ కార‌ణంగా అప్ప‌టి నుంచి రేవంత్‌ను కోమ‌టిరెడ్డి పెద్ద‌గా లెక్క చేయ‌ట్లేద‌ని తెలుస్తోంది.

రేవంత్ తీసుకుంటున్న ఏ నిర్ణ‌యాన్ని కూడా ఆయ‌న స్వాగ‌తించ‌ట్లేదు.

ద‌ళిత‌, గిరిజ‌న దండోరా కార్య‌క్ర‌మాల్లో కూడా పెద్ద‌గా స్పందించ‌లేదు.

ఇక‌పోతే రేవంత్ పార్టీ ప‌రంగా ఆదేశిస్తున్న ఎలాంటి నిర్ణ‌యాలు కూడా కోమ‌టిరెడ్డి పెద్ద‌గా సీరియ‌స్‌గా తీసుకుంటున్న‌ట్టు క‌నిపించ‌ట్లేదు.ఇక‌పోతే మొన్న వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి వ‌ర్థంతి సంద‌ర్భంగా విజ‌య‌మ్మ నిర్వ‌హించిన ఆత్మీయ స‌మ్మేళ‌నానికి ఎవ‌రూ కూడా కాంగ్రెస్ త‌ర‌ఫున వెళ్లొద్ద‌ని, అది ఆత్మయ స‌భ కాద‌ని రాజ‌కీయ వేదిక అని కాంగ్రెస్ ఆదేశాలు జారీ చేసింది.

ఈ స‌భ‌కు ఎవ‌రు వెళ్లినా పార్టీకి న‌ష్టం జ‌రుగుతుంద‌ని కాబ‌ట్టి ఎవ‌రూ వెళ్లొద్ద‌ని ఆదేశించారు.

Telugu Congress, Komati, Revanth, Tg, Ys Sharmila, Ys Vijayamma-Telugu Political

కానీ ప్ర‌జాప్ర‌తినిధిగా ఉన్న ఒక్క కోమ‌టిరెడ్డి మాత్ర‌మే కాంగ్రెస్ నుంచి ఈ స‌మావేశానికి హాజ‌ర‌య్యారు.ఆ స‌మావేశంలో కోమ‌టిరెడ్డి వైఎస్ చేసిన ప‌నుల గురించి వివ‌రించారు.దీంతో ఇప్పుడు ఆయ‌న చేసిన ప‌నిపై రేవంత్ టీమ్ ఫుల్ సీరియ‌స్‌గా ఉందని తెలుస్తోంది.

ఎందుకంటే పార్టీ అధ్య‌క్షుడిగా ఆయ‌న ఇచ్చిన ఆదేశాలు పాటించ‌క‌పోవ‌డంతో పార్టీలైన్ దాటుతున్న‌ట్టు భావిస్తున్నారు కాంగ్రెస్ నేత‌లు.ఇన్ని రోజులు అవుతున్నా కూడా కోమ‌టిరెడ్డి ఇలా చేయ‌డంతో ఆయ‌న పార్టీలో అస‌లు ఉంటారా అనే అనుమానాలు పెరుగుతున్నాయి.

మ‌రి దీనిపై రేవంత్ ఏమైనా యాక్ష‌న్ తీసుకుంటారా లేక‌పోతే సైలెంట్‌గా నే ఉంటారా అన్న‌ది మాత్రం వేచి చూస్తే తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube