బండి సంజయ్ అరెస్ట్ అంశం బీజేపీకి రాజకీయంగా అంతగా లాభించలేదా?

తెలంగాణ బీజేపీ తెలంగాణలో మునుపెన్నడూ లేనంతగా రాజకీయ వ్యూహాలకు తెరదీస్తూ సరికొత్త రాజకీయానికి పునాది వేస్తోంది.ఇప్పట వరకు తెలంగాణలో శాంతి భద్రతల సమస్య అనేది ఎప్పుడూ సంభవించలేదు.

 Didn't Bandi Sanjay's Arrest Benefit The Bjp So Much Politically, Kcr, Bjp Party-TeluguStop.com

అయితే తాజాగా బండి సంజయ్ అరెస్ట్ తో ఒక్కసారిగా పోలీసుల చర్యలు, అరెస్ట్ లతో తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయంగా అలజడి రేగిన విషయం తెలిసిందే.జీవో నెంబర్ 317లో సవరణలు చేపట్టాలని జన జాగరణ దీక్ష చేపట్టిన సమయంలో కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించారని బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

అయితే రాజకీయంగా ఈ అంశాన్ని పెద్ద ఎత్తున ఉపయోగించుకుందామని భావించినప్పటికీ అంతగా రాజకీయ లబ్ధి అనేది జరగలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

అయితే బండి సంజయ్ అరెస్ట్ విషయంలో తెలంగాణలో రోజురోజుకు కరోనా కేసులు విజృంభిస్తున్న కారణంగానే బండి సంజయ్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు ప్రజల్లోకి వెళ్ళిందని, కెసీఆర్ ను టార్గెట్ చేసి బీజేపీ చేసిన వ్యాఖ్యలు ప్రజల్లోకి అంతగా వెళ్లని పరిస్థితి ఉంది.

ఏది ఏమైనా టీఆర్ఎస్ పార్టీ టార్గెట్ గా బీజేపీ ఇంకా విమర్శల వర్షం కురిపిస్తున్న పరిస్థితి ఉంది.ఇప్పటికే బీజేపీ జాతీయ నేతలు కరీంనగర్ జన జాగరణ సభ ఘటన ప్రదేశాన్ని సందర్శించి అప్పుడు జరిగిన పరిస్థితులను మాజీ సీఎం రమణ్ సింగ్, తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంచార్జీ తరుణ్ చుగ్ తెలుసుకున్నారు.

అయితే బండి సంజయ్ అరెస్ట్ అంశం బీజేపీకి రాజకీయంగా లాభం జరగకపోవడానికి ప్రధాన కారణం కెసీఆర్ ఈ ఘటనపై ఎటువంటి కామెంట్ చేయకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారకపోవడంతో ప్రజల్లో ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అనే విషయంపై ఒక క్లారిటీ కి రాలేని పరిస్థితి ఏర్పడింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube