రామానాయుడు, విజయ నిర్మల భార్యభర్తలుగా నటించిన సినిమా ఏంటో తెలుసా?

రామానాయుడు.ప్రముఖ నిర్మాత.

 Did You See This Scene Of Rama Naidu And Vijaya Nirmala Marriage, Jaggayya, Raja-TeluguStop.com

మూవీ మొఘల్ గా పేరు సంపాదించి అత్యధిక సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన వ్యక్తిగా గిన్నీస్ బుక్ ఆఫ్ వలర్డ్ రికార్డ్స్ లోకి ఎక్కిన వ్యక్తి.విజయ నిర్మల.

అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిని మహిళా దర్శకురాలిగా ఈమె కూడా గిన్నీస్ బుక్ లోకి ఎక్కింది.వీరిద్దరు కలిసి ఓ సినిమాలు నటించారు.

అదీ భార్యభర్తలుగా.ఇంతకీ ఆ సినిమా ఏంటో.వాళ్లు చేసిన క్యారెక్టర్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

19868లో పాపకోసం అనే సినిమా వచ్చింది.ఈ సినిమాను రామానాయుడు నిర్మించాడు.దొంగల్లో కూడా మానవత్వం ఉంటుందని ఈ సినిమాలో చూపిస్తారు.ఈ సినిమాకు సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌ లో అసోసియేట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేసిన శేష‌గిరిరావు దర్శకత్వం వహించాడు.జ‌మీందారు మోహ‌న్ రావు ఇంట్లో అర్ధ‌రాత్రి పూట దొంగలు ప్రవేశిస్తారు.

ఇంట్లో వారందరినీ కాల్చి చంపేస్తారు.నాలుగేళ్ల పాపను మాత్రం తమతో తీసుకెళ్తారు ముగ్గురు దొంగలు.

ఈ ముగ్గురు దొంగలు మూడు మతాలకు చెందిన వారు.జోసెఫ్‌ గా సత్యనారాయణ, కిష్ట‌య్య‌గా త్యాగరాజు, హుస్సేన్ గా రామదాసు నటించారు.

చిన్నారిగా రాణి నటించింది.

దొంగలు తీసుకెళ్లిన పాపే పెద్దదై పెళ్లి చేసుకుంటుంది.

ఆ పాత్రను విజయ నిర్మల పోషించింది.ఆమెను పెళ్లి చేసుకునే వ్యక్తి క్యారెక్టర్ ను రామానాయుడు చేశాడు.

ఈ ఇద్దరూ ఇందులో గెస్ట్ రోల్స్ చేశారు.ఈ సినిమాలో మరో విశేషం ఏంటంటే.

విజయ నిర్మల తండ్రి పాత్రను ఆ తర్వాత కాలంలో ఆమె భర్త కృష్ణ పోషించాడు.అయితే ఆయన సీన్లు అన్నీ విజయ నిర్మల చిన్న నాటి పాత్రలకే పరిమితం అవుతాయి.

ఈ సినిమాలో జమీందారు మోహనరావు పాత్ర కృష్ణ చేస్తాడు.ఈ సినిమాలో ఒక పాటతో పాటు కొన్ని సీన్లలోనే ఉంటాడు.ఆ తర్వాత తనను దొంగలు చంపేస్తారు.

Telugu Scenerama, Gitanjali, Jaggayya, Papakosam, Rajababu, Ramanayudu, Relangi,

ఈ సినిమాలో జ‌గ్గ‌య్య‌, రాజ‌బాబు, వెన్నిరాడై నిర్మ‌ల‌, రేలంగి, గీతాంజ‌లి సహా పలువురు దిగ్గజ నటులు గెస్ట్ రోల్స్ చేశారు.ఈ సినిమాకు పెండ్యాల మ్యూజిక్ అందించారు.ఆత్రేయ రాసిన పలు పాటలు మంచి ప్రజాదరణ పొందాయి.

ఈ సినిమాను హైదరాబాద్ లోని కమల్ టాకీస్ లో ప్రత్యేకంగా ప్రదర్శించారు.ఇందుకు గాను వచ్చిన రూ.30 వేలను పోలీసు కుటుంబాల సంక్షేమ నిధికి రామానాయుడు అందజేశాడు.ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube