30 గుడ్లతో తయారు చేసిన ఈ ఎగ్ రోల్ చూశారో... నోరూరడం పక్కా..

కోడిగుడ్లు మనలో ఎవరైనా సరే లొట్టలేసుకుంటూ తింటూ ఉంటారు.కోడిగుడ్ల పేరు చెబితేనే మనలో చాలా మందికి నోట్లో లాలాజలం ఊరుతుంది.

 Did You See This Egg Roll Made With 30 Eggs , Egg Roll, Viral Video-TeluguStop.com

అటువంటి కోడిగుడ్లతో చేసిన రెసిపీలు అన్నా కూడా అందరూ లొట్టలేసుకుంటూ తింటూ ఉంటారు.ఇక ఫుడ్ వీడియోలు నెట్టింట్లో తెగ చెక్కర్లు కొడుతూ ఉంటాయి.

రోజుకో ఫుడ్ వీడియో ఇక్కడ వైరల్ అవుతూ ఉంటుంది.ఈ వీడియోలను కనుక మనం చూస్తే మనకు నోట్లో లాలాజలం ఊరడం పక్కా.

ఇలా అనేక రకాల ఫుడ్ వీడియోలు మనకు సోషల్ మీడియాలో లభిస్తాయి.ఇప్పుడు కూడా కోడిగుడ్లకు సంబంధించిన ఓ ఫుడ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఉత్తర్ ప్రదేశ్ లోని నోయిడాలో ఉన్న బ్రహ్మపుత్ర మార్కెట్లో తీసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.ఇంతకీ ఈ వైరల్ వీడియో లో ఏముందంటే.

ఒక వ్యక్తి కోడిగుడ్లతో వెరైటీ వంటకాన్ని తయారు చేశాడు.ఇప్పుడు ఈ వంటకం నెటిజన్లను తీవ్రంగా ఆకర్షిస్తోంది.

ఇంతకీ అతడు ఏం వంటకం చేశాడంటే… మొదట ఓ వ్యక్తి ఓ పెనాన్ని తీసుకుని దాని మీద నూనెను పోశాడు.ఆ తర్వాత బాగా కట్ చేసిన క్యారెట్, మరియు ఇతర కూరగాయల ముక్కలను దానిమీద వేయించాడు.

ఇక ఆ ముక్కలు ఫ్రై అయిన తర్వాత వాటిని పక్కకు పెట్టి, ముందుగా తయారు చేసిన చపాతీ పిండితో రొట్టెను తయారు చేసి ఆ రొట్టెను బాగా కాల్చాడు.ఇక ఆ తర్వాత ఆ రొట్టె మీద ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 30 గుడ్లను ఆమ్లెట్ లా వేయించాడు.

అలా చేసిన తర్వాత ముందుగా ఫ్రై చేసిన కూరగాయల ముక్కలను ఆ రొట్టె మీద వేసి రోల్ లా తయారు చేశాడు.ఇతడు తయారు చేసిన రోల్ ఎలా ఉందో మీరు కూడా చేసేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube