ఈ ఫోటోలో ఉన్న స్టార్ యాంకర్ ఎవరో గుర్తుపట్టారా?

గుర్తుపట్టారా? స్టార్ యాంకర్ అండి.బుల్లితెరపై ప్రతి రోజు కనిపిస్తుంటుంది.

 Did You See Suma Kanakala Childhood Photo  Suma Kanakala, Childhood Photo, Rajee-TeluguStop.com

ఏ ఛానెల్ ఆన్ చేసిన ఆమె కనిపిస్తుంది.ఇంకా గుర్తు రాలేదా? ఆమెనండి… స్టార్ యాంకర్ సుమ కనకాల.ఆమె ఎటువంటి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోలేదు కాబట్టి చిన్నప్పటి ఫోటోలు చూసిన యిట్టె కనుక్కుంటారు.అయితే ఈ స్టార్ యాంకర్ గురించి ఏం చెప్పాలి ఎంత చెప్పాలి.

ప్రేమించి రాజీవ్ కనకాల పెళ్లి చేసుకున్నారు.అతడు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తుంటే ఈమె బుల్లితెరపై స్టార్ యాంకర్ గా ఎదిగింది.

చిన్నప్పటి నుంచే చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ కెరీర్ ప్రారంభించిన సుమ కనకాల.16 ఏళ్ల వయసులోనే సీరియల్స్ లో నటించింది.హీరోయిన్ అవ్వాలి అనుకున్న సుమ సీరియల్స్ లో నటిస్తూ మెల్లగా యాంకరింగ్ లోకి వచ్చేసింది.మొదట్లో పట్టుకుంటే పట్టు చీర అంటూ చిన్న చిన్న ప్రోగ్రామ్స్ లో యాంకరింగ్ చేసిన సుమ కనకాల మెల్లగా ఒక్కో షో కి యాంకరింగ్ చేస్తూ వచ్చింది.

స్టార్ మహిళ అయితే ఎన్ని ఎపిసోడ్ లు పూర్తి చేసిందో ఆమెకే కౌంట్ ఉండదు.దాదాపు కొన్ని సంవత్సరాలు ఆ షో ని అలాగే కొనసాగించింది సుమ అక్క.

ఇక సుమ కనకాల కొన్ని సినిమాల్లో కూడా నటించింది.పవిత్ర ప్రేమ, చాలాబాగుంది, వర్షం, ఢీ వంటి సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ లో నటించింది.

ఈటీవీలో ఈమె చేసే కొన్ని షోస్ సంవత్సరాలు సంవత్సరాలు చేస్తుంటుంది కానీ ఆ షో కి టీఆర్పీ తగ్గదు.బుల్లితెర మహానటి అంటే సుమ కనకాల అనే చెప్తారు.

ఇటు కెరీర్ ని అటు వ్యక్తిగత జీవితాన్ని రెండిటిని సరిగ్గా అద్భుతంగా మానేజ్ చేస్తుంది సుమ కనకల.సుమ కనకాలలా ఏ యాంకర్ ఇప్పటి వరకు లేరు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube