అచ్చం ముత్యాలే.. ఎన్టీఆర్ చేతి నుంచి జాలువారిన అక్షరాలు..

ఎన్టీఆర్.తెలుగు జనాలకు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు.తెలుగు సినీ నటుడిగా.అద్భుత రాజకీయవేత్తగా ఆంధ్ర ప్రజల మనసుల్లో చెరిగిపోని ముద్ర వేసిన నాయకుడు.ఆయన చేసిన సినిమాలు అయినా.పరిపాలన అయినా.

 Did You See Sr Ntr Hand Writting, Sr Ntr , Hand Writing , Tollywood , Poltics ,-TeluguStop.com

తెలుగు ప్రజలు గర్వపడేలా ఉన్నాయి.ఆయన కేవలం నటుడు మాత్రమే కాదు.

పలు సినిమాలకు దర్శకత్వం వహించారు.చాలా సినిమాలకు నిర్మాతగా చేశాడు.

తన చక్కటి నటనతో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నాడు.కోట్లాది మంది అభిమానాన్ని దక్కించుకున్నాడు.

ఆయన జీవితంలో ఎక్కవ రోజులు సినిమాల్లోనే గడపడం విశేషం.

సినిమాల పరంగా ఆయనను జనాలు ఏ స్థాయిలో ఆదరించారో.

రాజకీయాల్లోకి వచ్చాక కూడా ఆయనను అదే స్థాయిలో చూశారు.తెలుగుదేశం పార్టీ స్థాపించాక ఆయన అధికారంలోకి రావాలని కోట్లాది మంది కోరుకున్నారు.

పార్టీ ఏర్పాటు చేసిన ఏడాదిలోనే ఆయన అధికారంలోకి వచ్చారు.జనాల ఆయనకు అఖండ మెజార్టీ అందించారు.

ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన ఎన్టీఆర్.ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సుపరిపాలన అందించారు.

తెలుగు సినిమా పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్ కు వచ్చేందుకు ఆయన ఎంతగానో శ్రమించారు.

ఎన్టీఆర్ గురించి తక్కువ మంచికి తెలిసిన విషయం ఏంటంటే ఆయన చేతిరాత.తను రాసే అక్షరాలు కడిగిన ముత్యాల్లా ఉంటాయి.ఆయన రాసిన ఓ లేఖ ఓ పత్రికలో ప్రచురింప బడింది.

దానికి పాఠకుల నుంచి మంచి స్పందన వచ్చింది.దీంతో స్వయంగా తన చేతితో ఓ లేఖ రాయాలని విజయచిత్ర పత్రిక పబ్లిషర్ కోరారు.

ఆయన కోరిక మేరకు ఎన్టీఆర్ మూడు పేజీల లేఖ రాశాడు.దాన్ని యథావిధిగా ప్రచురించారు.

ఆయన చేతి రాతను చూసి తెలుగు జనాలు అబ్బుర పడ్డారట.సినిమాల్లో బిజీగా ఉండే ఎన్టీఆర్..ఖాళీ సమయంలో ఈ లేఖ రాశాడట.ఆయన చేతి రాత ప్రతులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడం విశేషం.ఎన్టీఆర్ రాసిన ఆలేఖ చూసి ఆయన అభిమానులు ముచ్చట పడుతున్నారు.

Senior NTR Hand Writing NTR Hand Writing Photo Viral

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube