గాడ్ ఫాదర్ లో ఆ మెయిన్ క్యారెక్టర్ ని తీసేశారట.. అంతా చిరు కోసమే?

మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని వెంటనే మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు.ఈ సినిమా మలయాళంలో ఎంతో అద్భుతమైన విజయాన్ని సాధించిన లూసిఫర్ చిత్రానికి రీమేక్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

 Did They Remove Main Character In God Father For Just Chiranjeevi Detials,  God-TeluguStop.com

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించి ఒక సమాచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.మలయాళంలో మోహన్ లాల్ సోదరుడి పాత్ర ఎంతో కీలకంగా ఉంటుంది.

ఆయనని ముఖ్యమంత్రిని చేయడం కోసమే అందులో మోహన్ లాల్ ఎంతో శ్రమించినట్లు తెలుస్తోంది.

ఇక ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసి పూర్తిగా తమ్ముడు పాత్రను తెలుగు రీమేక్ చిత్రంలో తీసేసినట్టు తెలుస్తుంది.

అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.ఇకపోతే ఈ సినిమా విషయంలో డైరెక్టర్ పూరి జగన్నాథ్ కల్పించుకుని డైరెక్టర్ మోహన్ రాజాకు పలు సలహాలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది.

పూరి జగన్నాథ్ ఇచ్చిన సలహాలు మెగాస్టార్ కి కూడా నచ్చడంతో అతని సలహాల ప్రకారం స్క్రిప్టులో కొన్ని మార్పులు చేశారని, ఇందులో భాగంగానే చిరంజీవి తమ్ముడి పాత్రను పూర్తిగా తీసేసినట్టు తెలుస్తుంది.

Telugu Acharya, Bhola Shankar, Chiranjeevi, Puri Jagannath, God, Meher Ramesh, M

దాదాపు 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే మిగతా షూటింగ్ పూర్తి చేసుకోనుంది.ఇకపోతే నవంబర్ 11వ తేదీ నుంచి మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భోళాశంకర్ సినిమా ప్రారంభం కానుంది.ఈ సినిమా తర్వాత బాబి దర్శకత్వంలో మెగాస్టార్ మరొక సినిమాలు చేయనున్నారు ఈ సినిమా కూడా ప్రారంభమైన సంగతి మనకు తెలిసిందే.

ఇలా వరుస సినిమాలతో మెగాస్టార్ ఎంతో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే ఆయన నటించిన ఆచార్య సినిమా ఫిబ్రవరి 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube