ఈ పవన్ కళ్యాణ్ చెల్లెలు మీకు ఇంకా గుర్తుందా..? ఇప్పుడు ఏం చేస్తుందంటే...?

తెలుగులో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన “అన్నవరం” అనే చిత్రంలో టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెల్లెలి పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన “నటి సంధ్య” ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులకు బాగానే గుర్తుంటుంది.అయితే సంధ్య తమిళంలో ప్రముఖ దర్శకుడు బాలాజీ శక్తి వేల్ దర్శకత్వం వహించిన “కాదల్ (తెలుగులో ప్రేమిస్తే)” అనే చిత్రం ద్వారా సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమై తన మొదటి సినిమాతోనే తెలుగు, తమిళ సినిమా పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

 Sandhya, Tollywood Actress, Telugu Heroine, Annavaram, Pawan Kalyan,-TeluguStop.com

హీరోయిన్ సంధ్య కేరళ రాష్ట్రంలోని త్రివేండ్రంలో పుట్టి పెరిగింది.అలాగే తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో విద్యాభ్యాసాన్ని పూర్తి చేసింది.ఆ తర్వాత సినిమాలపై ఆసక్తి  కలగడంతో పలు చిత్రాల ఆడిషన్స్ కి హాజరైంది.  అయితే ఒకప్పుడు చేతి నిండా వరుస అవకాశాలతో బాగానే రాణిస్తున్న సమయంలో తమిళనాడుకు చెందిన ఓ ప్రముఖ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ని పెళ్లి చేసుకుంది.

ప్రస్తుతం నటి సంధ్య కి ఒక పాప కూడా ఉంది.దీంతో నటి సంధ్య ప్రస్తుతం తన కుటుంబ బాధ్యతలను చక్క బెట్టుకునే పనిలో పడింది.అయితే పెళ్లయిన తర్వాత నటి సంధ్య సినిమాల్లో నటించడం పూర్తిగా మానేసింది.కాగా ప్రస్తుతం నటి సంధ్య కుటుంబ సభ్యుల తో కలిసి తమిళనాడు లోని  చెన్నై పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి తన సొంత నివాసంలో ఉంటున్నట్లు సమాచారం.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఈ  మధ్య కాలంలో నటి సంధ్య తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టడం కోసం బాగానే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.ఇందులో భాగంగా ఇప్పటికే ఓ తమిళ ప్రముఖ దర్శకుడు దర్శకత్వం వహిస్తున్న  ఓ చిత్రంలో లో హీరోయిన్ అక్క పాత్రలు నటించే అవకాశం ఇవ్వడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube