ఈ స్టార్ హీరోయిన్ ఇంకా మీకు గుర్తుందా….?  

Did You Remember This Telugu Heroine - Telugu Bhadra, Meera Jasmine, Raviteja, Telugu Heroine, Tollywood, Tollywood Actress

తెలుగులో ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించినటువంటి “భద్ర” అనే చిత్రంలో రవితేజ సరసన నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న మలయాళ కుట్టి మీరా జాస్మిన్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు తెలుగులో నటించింది కొన్ని సినిమాలే అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులను మాత్రం తన అందం, అభినయం, నటనతో  బాగానే కట్టిపడేసింది.

 Did You Remember This Telugu Heroine

అయితే ఒకప్పుడుతెలుగులో చేతినిండా సినీ అవకాశాలతో దూసుకుపోతున్న సమయంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నటువంటి ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంది.

అయితే పెళ్లయిన కొత్తలో వీళ్ళిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండే వాళ్ళు.

ఈ స్టార్ హీరోయిన్ ఇంకా మీకు గుర్తుందా….-Latest News-Telugu Tollywood Photo Image

అయితే ఏమైందో ఏమోగాని పెళ్లి అయిన కొద్ది సంవత్సరాల తర్వాత మీరా జాస్మిన్ మరియు ఆమె భర్త ఈ మధ్య మనస్పర్థలు, గొడవలు వచ్చాయి.దీంతో మీరాజాస్మిన్ తన భర్త నుంచి 2016వ సంవత్సరంలో విడాకులు తీసుకున్నట్లు సమాచారం.

ప్రస్తుతం మీరా జాస్మిన్ కి ఒక కూతురు కూడా ఉంది.

అయితే తన భర్త నుంచి విడాకులు తీసుకున్న తరువాత మీరాజాస్మిన్ అడపాదడపా చిత్రాల్లో నటించింది.

కానీ ఆ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోకపోవడంతో తాను అనుకున్నంత ఆశాజనకంగా సెకండ్ ఇన్నింగ్స్ ని మీరాజాస్మిన్ ప్రారంభించ లేకపోయింది.

తెలుగులో మాస్ మహారాజా రవితేజ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణ, జగపతి బాబు, శివాజి, రాజశేఖర్ తదితర స్టార్ హీరోలతో నటించింది.

అయితే ఇటీవలే టాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందినటువంటి ఓ ప్రముఖ దర్శకుడు దర్శకత్వం వహిస్తున్న  చిత్రంలో మీరా జాస్మిన్ నటిస్తున్నట్లు పలు వార్తలు వినిపిస్తున్నాయి.మరి అప్పటి మాదిరిగా మీరాజాస్మిన్ తెలుగు ప్రేక్షకులను ఇప్పుడు ఆకట్టుకుంటుందో లేదో చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Did You Remember This Telugu Heroine Related Telugu News,Photos/Pics,Images..

footer-test