ఈ ఫొటోలో కనిపిస్తున్న చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరో గుర్తు పట్టారా..?

తెలుగులో ప్రముఖ  స్వర్గీయ దర్శకురాలు బి.జయ దర్శకత్వం వహించిన  “చంటి గాడు” అనే చిత్రంలో హీరోగా నటించి తెలుగు సినిమా పరిశ్రమకు హీరోగా పరిచయం అయినటువంటి నటుడు “బాలాదిత్య” గురించి తెలుగు సినీ పరిశ్రమలో తెలియనివారుండరు.

 Did You Remember These Tollywood Actor Baladitya, Baladitya, Tollywood  Hero, Ph-TeluguStop.com

అయితే బాలాదిత్య ఈ చిత్రంలో హీరోగా నటించక ముందు దాదాపుగా 20 కి పైగా చిత్రాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు.అయితే ఇందులో “లిటిల్ సోల్జర్స్” అనే చిత్రం తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

అయితే తాజాగా హీరో బాలాదిత్యకి సంబంధించినటువంటి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను పరిశీలించినట్లయితే బాలాదిత్య చైల్డ్ ఆర్టిస్ట్ గా నటిస్తున్న సమయంలో తీసినట్లు స్పష్టం గా తెలుస్తోంది.అయితే గతంలో పైచదువులు చదవడం కోసం కొన్నేళ్ల పాటూ సినిమాలకు బ్రేక్ ఇచ్చి ఇటీవలే తెలుగులో ప్రముఖ దర్శకుడు సతీష్ విగ్నేశ దర్శకత్వం వహించిన “ఎంత మంచి వాడవురా.!” అనే చిత్రంలో ఓ ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించి మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చాడు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా తెలుగులో బాలాదిత్య హీరోగా నటించిన చంటిగాడు, రూమ్మేట్స్, జాజిమల్లి, కీలుగుఱ్ఱం, 1940 లో ఒక గ్రామం, భద్రాద్రి, తదితర చిత్రాలు ప్రేక్షకులని బాగానే ఆకట్టుకున్నాయి.కాగా బాలాదిత్య ఆ మధ్య ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి ఈ టీవీ లో ప్రసారమయ్యే ఛాంపియన్ అనే గేమ్ షోకి హోస్ట్ గా కూడా వ్యవహరించాడు.

అలాగే స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే  శాంభవి అనే సీరియల్ లో కూడా హీరోగా నటించాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube