ఈ జయం హీరోయిన్ మీకు ఇంకా గుర్తుందా...?

తెలుగులో ప్రముఖ దర్శకుడు తేజ దర్శకత్వం వహించినటువంటి జయం అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా  పరిచయమైన ముంబై బ్యూటీ సదా గురించి తెలుగు సినీ పరిశ్రమలో తెలియనివారుండరు.అయితే ఈ అమ్మడు వచ్చీరావడంతోనే మంచి సాలిడ్ అందుకోవడంతో జూనియర్ ఎన్టీఆర్, మంచు మనోజ్, పవన్ కళ్యాణ్, మెగా స్టార్ చిరంజీవి వంటి స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు దక్కించుకొని స్టార్ హీరోయిన్ల సరసన వెలుగొందింది.

 Jayam Movie, Sada, Tollywood Actress, Tollywood, Movie Offers News-TeluguStop.com

అయితే తెలుగులో ఒకప్పుడు సదా వరుస హిట్లు మరియు చేతినిండా ఆఫర్లతో బిజీ బిజీగా గడుపుతున్న సమయంలో మలయాళ, తమిళ పరిశ్రమల వైపు మొగ్గు చూపింది.దీంతో ఈ అమ్మడికి రానురాను తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి.

అయితే  సదా మళ్లీ తెలుగులోకి రీ ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు.దీంతో ఈ అమ్మడు తెలుగులో పూర్తిగా తెరమరుగై పోయే అవకాశాలు కనిపించాయి.

దాంతో సదా అప్పుడప్పుడు పలు డ్యాన్స్ షోలకు జడ్జి గా కూడా వ్యవహరించింది.

అయితే ఇటీవల కాలంలో తమిళ భాషలో సదా నటించినటువంటి టార్చ్ లైట్ చిత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

అయితే ఈ చిత్రంలో సదా ఓ వేశ్య పాత్రలో కనిపించింది.అయితే ఎప్పుడూ అందం, అభినయంతో హీరోయిన్ పాత్రలో నటించి మెప్పించినటువంటి సదా ని ఆమె అభిమానులు వేశ్య పాత్రలో స్వీకరించ లేకపోయారు.

దాంతో సినిమా హిట్ అయినప్పటికీ సదా కి మాత్రం పెద్దగా గుర్తింపు రాలేదు.ఈ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న సదా కి చివరికి నిరాశే మిగిలింది.

ప్రస్తుతం సదా వెబ్ సిరీస్ లలో నటించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. 

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube