ఈ ఫోటోలో కనిపిస్తున్న స్టార్ హీరోలు ఎవరో గుర్తు పట్టారా...?

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మెగా హీరోలకి ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.అయితే ఇందులో మొదటగా మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా పరిశ్రమ కి వచ్చి టాలీవుడ్ లో నెంబర్ వన్ స్టార్ హీరోగా ఎదిగాడు.

 Did You Recognize These Who Is These Tollywood Star Heroes In This Photo, Pawan-TeluguStop.com

దీంతో తన తమ్ముళ్ళయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు మెగా బ్రదర్ నాగబాబు లను కూడా బాగానే ఎంకరేజ్ చేశాడు.దీంతో తన రెండవ తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా సౌత్ ఇండియాలోనే ఎనలేని అభిమానులు ఉన్నారు.

అలాగే నాగ బాబు కూడా నటుడిగా నిర్మాత గా బాగానే రాణిస్తున్నాడు.

కాగా తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియా మాధ్యమాలలో వైరల్ అవుతోంది.

అయితే ఈ ఫోటోని ఒకసారి పరిశీలించినట్లయితే చిన్నప్పుడు రామ్ చరణ్ తేజ్ తన బాబాయ్ పవన్ కళ్యాణ్ తో కలిసి దిగినట్లు స్పష్టంగా తెలుస్తోంది.దీంతో ఈ ఫోటోలను మెగా అభిమానులు తమ సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేస్తూ బాగానే వైరల్ చేస్తున్నారు.

అంతేకాకుండా ఒకే ఫ్రెములో బాబాయి, అబ్బాయి యంగ్ లుక్ లో అదరగొట్టారంటూ కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన “వకీల్ సాబ్” చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది.

కాగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్  “హరిహర వీరమల్లు” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.ఈ చిత్రానికి టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇక రామ్ చరణ్ తేజ్ విషయానికి వస్తే ప్రస్తుతం తెలుగులో ప్రముఖ దర్శకుడు జక్కన్న రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న “ఆర్.ఆర్.ఆర్” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube