ఈ ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా..?

తెలుగులో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన “నీ తోడు కావాలి” అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన ముంబై బ్యూటీ “చార్మి కౌర్” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ అమ్మడు సినిమా పరిశ్రమకు వచ్చిన మొదట్లో కొంత మేర అవకాశాల కోసం తీవ్రంగా శ్రమించినప్పటికీ వరుస సినిమా అవకాశాలు దక్కించుకుని క్రమక్రమంగా విక్టరీ వెంకటేష్ కింగ్ నాగార్జున మాస్ మహారాజా రవితేజ తదితర స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు దక్కించుకొని హీరోయిన్ గా బాగానే నిలదొక్కుకుంది.

 Did You Recognize These Tollywood Heroine In Childhood Photo, Charmi Kaur, Telug-TeluguStop.com

అయితే తాజాగా హీరోయిన్ ఛార్మి కి సంబంధించినటువంటి ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతుంది. అయితే ఆ ఫోటో ని ఒకసారి పరిశీలించినట్లయితే తన చిన్నప్పుడు పుట్టినరోజు వేడుకల్లో తీసినట్లు తెలుస్తోంది.

దీంతో ఛార్మి కౌర్ అభిమానులు ఈ ఫోటో పై స్పందిస్తూ చిన్నప్పుడు ఛార్మి ఏంజెల్ లాగ ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నటి ఛార్మి కౌర్ సినిమాల్లో హీరోయిన్ గా నటించడం మానేసి నిర్మాతగా బాగానే రాణిస్తోంది.

కాగా ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న “ఫైటర్” అనే చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది.ఈ చిత్రంలో హీరో గా టాలీవుడ్  రౌడీ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తుండగా బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది.

కాగా ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పనులు ముంబై పరిసర ప్రాంతంలో జరుగుతున్నట్లు సమాచారం…

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube