ఈ తెలుగు హీరోయిన్లను గుర్తు పట్టారా..?  

Poonam kaur, Kamna Jatmalani, Telugu heroines, Tollywood - Telugu Kamna Jatmalani, Poonam Kaur, Telugu Heroines, Tollywood

తెలుగులో యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా నటించినటువంటి “రణం” చిత్రంలో హీరోయిన్ గా నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన బెంగళూరు బ్యూటీ కామ్నా జఠ్మలానీ గురించి తెలియని వారు ఉండరు.అయితే ఈ అమ్మడు తెలుగులో హీరోయిన్ గా సినీ కెరియర్ మొదలు పెట్టిన కొత్తలో బాగా రాణించినప్పటికీ  ఆ తర్వాత బెంగళూరు కి చెందినటువంటి ఓ ప్రముఖ వ్యాపార వేత్తను పెళ్లి చేసుకుని సెటిల్ అయింది.

 Did You Recognize These Telugu Heroines

ప్రస్తుతం కామ్నా జెఠ్మలానీ సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటోంది.

ఇందులో భాగంగా తాజాగా కామ్నా జఠ్మలానీ తెలుగులో సీనియర్ హీరో శ్రీకాంత్ హీరోగా నటించినటువంటి “మాయాజాలం” చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయం అయిన  పూనమ్ కౌర్ తో దిగినటువంటి ఫోటోని తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంది.

ఈ తెలుగు హీరోయిన్లను గుర్తు పట్టారా..-Latest News-Telugu Tollywood Photo Image

ఇందులోభాగంగా అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ మళ్లీ మంచి రోజులు రావాలని కోరుకుంటున్నట్లు ట్యాగ్ చేసింది. అయితే వీరిద్దరూ సినీ కెరీర్ పరంగానేగాక వ్యక్తిగతంగా కూడా మంచి స్నేహితులని గతంలో కూడా పలు ఇంటర్వ్యూలలో కామ్నా జఠ్మలానీ తెలిపింది.

దీంతో కొందరు నెటిజన్లు ఈ ఫోటోని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా పెళ్లయిన తర్వాత కామ్నాజఠ్మలానీ సినిమాల పరంగా కొంతమేర జోరు తగ్గించినప్పటికీ తన సెకండ్ ఇన్నింగ్స్ కోసం ఈ మధ్య బాగానే కసరత్తులు చేస్తోంది.

అయితే పూనమ్ కౌర్ మాత్రం  సినీ కెరియర్ పరంగా ఇప్పటి వరకు చెప్పుకోవడానికి సరైన హిట్ లేక పోవడంతో అవకాశాలు దక్కించుకోవడంలో కొంత మేర ఇబ్బందులు పడుతోంది.

#Poonam Kaur #Kamna Jatmalani

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Did You Recognize These Telugu Heroines Related Telugu News,Photos/Pics,Images..