ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్న పాప ప్రస్తుతం హీరోయిన్ అని మీకు తెలుసా....?

తెలుగులో ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహించినటువంటి ఆర్య అనే చిత్రంలో తన ముద్దు ముద్దు మాటలతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నటువంటి ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ శ్రావ్య ఇప్పటికి బాగానే గుర్తుంటుంది.అయితే అంతకు ముందు ఈ అమ్మడు టాలీవుడ్ ప్రముఖ హీరో జగపతిబాబు హీరోగా నటించినటువంటి సందడే సందడి చిత్రంలో నటించినప్పటికీ ఆ చిత్రంలో ఈ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో ఎవరు గుర్తించలేదు.

 Shravya, Telugu Child Artist, Telugu Heroine, Arya, Movie News-TeluguStop.com

అయితే చైల్డ్ ఆర్టిస్ట్ గా పనిచేసిన కొంతకాలానికి టాలీవుడ్ దర్శకుడు గోవర్ధన్ రెడ్డి దర్శకత్వం వహించినటువంటి లవ్ యూ బంగారం అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమలోకి హీరోయిన్ గా పరిచయమైంది.ఈ చిత్రంలో హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ హీరోగా నటించాడు.

కాగా ఈ చిత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.కాదా శ్రావ్య తన తదుపరి చిత్రాల కథల విషయంలో కొంత మేర అవగాహన లోపించడంతో ఆ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ కాలేకపోయాయి.

కాగా ఇప్పటివరకు శ్రావ్య తెలుగు తమిళ భాషల్లో కలిపి దాదాపు ఏడు చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది.

అయితే హైదరాబాదులో పుట్టి పెరిగినటువంటి శ్రావ్య స్థానిక నగరంలో ఉన్నటువంటి ఓ ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ కూడా పూర్తి చేసింది.

ఆ తర్వాత నటన మీద ఆసక్తి కనబరచడంతో తల్లిదండ్రులు ప్రోత్సహించి సినీపరిశ్రమకు పంపించినట్లు గతంలో శ్రావ్య ఇంటర్వ్యూలో తెలిపింది.అయితే  2017వ సంవత్సరంలో విలయత్తు ఆరంభం అనే తమిళ చిత్రంలో అనే చిత్రంలో శ్రావ్య చివరగా  కనిపించింది.

కాగా ఇప్పటివరకు ఈ అమ్మడు సంబంధించినటువంటి ఎలాంటి సినిమా అప్డేట్ లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube