ఈ ఫోటోలో వెంకటేష్ తో ఉన్న బుడతడు ఎవరో గుర్తు పట్టారా...?

తెలుగులో ప్రముఖ దర్శకుడు వాసు వర్మ దర్శకత్వం వహించిన  “జోష్” అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోగా పరిచయమైన హీరో అక్కినేని నాగ చైతన్య గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే తాజాగా సోషల్ మీడియా మాధ్యమాలలో నాగ చైతన్య కి సంబంధించిన కొన్ని ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

 Venkatesh, Akkineni Naga Chaitanya, Tollywood Hero's, Childhood Memories, Tollyw-TeluguStop.com

అయితే ఆ ఫోటోలను ఒకసారి పరిశీలించినట్లయితే టాలీవుడ్ విక్టరీ వెంకటేష్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న సమయంలో అక్కినేని నాగ చైతన్య తో కలిసి తీయించుకున్నట్లు తెలుస్తోంది.అయితే అక్కినేని నాగచైతన్యకు విక్టరీ వెంకటేష్ స్వయాన మేనమామ.

దీంతో ఇటు వెంకటేష్ అభిమానులు ఆటు నాగచైతన్య అభిమానులు ఈ ఫోటోలని సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ షేర్ చేస్తున్నారు.అంతేగాక దగ్గుబాటి బాసు తో అక్కినేని చిన్నోడు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న “నారప్ప” ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.ఈ చిత్రం తమిళం లో మంచి విజయం సాధించినటువంటి “అసురన్” అనే చిత్రానికి రీమేక్ గా ఉంది.

కాగా అక్కినేని నాగ చైతన్య ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న “లవ్ స్టోరీ” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ పూర్తయి విడుదల కావాల్సి ఉండగా ప్రస్తుతం కరోనా వైరస్ కలకలం సృష్టిస్తున్న కారణంగా కొంతకాలం పాటు వాయిదా వేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube