కొంతమంది నటీనటులకు వచ్చీరావడంతోనే మంచి హిట్ లభించినప్పటికీ క్రమక్రమంగా సినిమా కథల విషయంలో అవగాహన లోపించడంతో అందం, అభినయం, మెండుగా ఉన్నప్పటికీ కొంత మంది నటీనటులు పెద్దగా రాణించలేక పోతుంటారు.అయితే తెలుగులో ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన అర్జున్ రెడ్డి అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిచయం హీరోయిన్ గా పరిచయమైన శాలిని పాండే కూడా ఈ కోవకే చెందుతుంది.
అయితే ఈ అమ్మడు వచ్చి రావడంతోనే అర్జున్ రెడ్డి వంటి హిట్ చిత్రం తో ఇచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో హీరోయిన్గా మాత్రం నిలదొక్కుకోలేకపోయింది.కానీ అడపా దడపా చిత్రాల్లో హీరోయిన్గా నటించే అవకాశాలు వచ్చినప్పటికీ కథలు మరియు చిత్రాలలోని పాత్రల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లే ఈ బ్యూటీ హీరోయిన్ గా నిలదొక్కుకోలేకపోయిందని చెప్పవచ్చు.
తాజాగా నటి శాలిని పాండే కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతున్నాయి.ఒకసారి ఆ ఫోటోలను పరిశీలించినట్లయితే చిన్నప్పుడు శాలిని పాండే పెదవులకు లిప్ స్టిక్ రాస్తున్న సమయంలో తీసినట్లు తెలుస్తోంది.
ఇటీవలే ఈ ఫోటోని శాలిని పాండే అభిమాని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఫోటో తెగ వైరల్ అవుతోంది.అంతేకాకుండా ఈ ఫోటోపై కొందరు నెటిజన్లలో స్పందిస్తూ చిన్నప్పుడు శాలిని పాండే చాలా క్యూట్ గా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే శాలిని పాండే తెలుగులో నిశ్శబ్దం అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించింది.కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.దీంతో అప్పటి నుంచి ఈ బ్యూటీ తన తదుపరి చిత్రం కథల విషయంలో కొంతమేర ఆచితూచి అడుగులు వేస్తోంది.కాగా ప్రస్తుతం ఈ అమ్మడికి తెలుగులో పెద్దగా సినీ అవకాశాలు లేకపోయినప్పటికీ బాలీవుడ్ లో మాత్రం రెండు చిత్రాలలో హీరోయిన్ గా నటిస్తోంది.
ఇందులో ఇప్పటికే జయేష్ బాయ్ జోర్దార్ అనే చిత్రం షూటింగ్ పనులు పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది.ఇక మరో చిత్రం ముంబై నగర పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్నట్లు సమాచారం.