ఈ గ్రూప్ ఫోటోలో ఓ తెలుగు స్టార్ హీరోయిన్ ఉంది… ఎవరో గుర్తు పట్టారా…?  

did you recognize Anushka Shetty in this Group photo , Anushka Shetty, Tollywood heroine, te;ugu actress, Group Photo, Nishabdham movie, College life memories - Telugu @msanushkashetty, Anushka Shetty, College Life Memories, Did You Recognize Anushka Shetty In This Group Photo, Group Photo, Nishabdham Movie, Te;ugu Actress, Tollywood Heroine

తెలుగులో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన “సూపర్” అనే చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన బెంగళూరు బ్యూటీ “అనుష్క శెట్టి” గురించి తెలుగు సినీ పరిశ్రమలో తెలియని వారుండరు. మొదట్లో సినిమా అవకాశాల కోసం ఈ అమ్మడు కొంతమేర ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఆ తరువాత వరుసగా స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు దక్కించుకుని దాదాపుగా 20 సంవత్సరాల కాలం పాటు టాలీవుడ్ సినిమా పరిశ్రమలో నెంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగుతోంది.

TeluguStop.com - Did You Recognize Anushka Shetty In This Group Photo

కాగా అనుష్క శెట్టి తెలుగులో దాదాపుగా అందరి స్టార్ హీరోల సరసన నటించి ప్రేక్షకులను బాగానే మెప్పించింది.
తాజాగా అనుష్క శెట్టి కి సంబంధించినటువంటి ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.

అయితే ఆ ఫోటో ని ఒకసారి పరిశీలించినట్లయితే అనుష్క శెట్టి సినిమాల్లోకి రాకముందు కాలేజీలో చదివే సమయంలో తోటి విద్యార్థులు మరియు ఉపాధ్యాయులతో కలిసి గ్రూప్ ఫోటో తీయించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అనుష్క శెట్టి అభిమానులు ఈ ఫోటోని సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ చేస్తున్నారు.

TeluguStop.com - ఈ గ్రూప్ ఫోటోలో ఓ తెలుగు స్టార్ హీరోయిన్ ఉంది… ఎవరో గుర్తు పట్టారా…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

 అంతేగాక ఈ ఫోటోని షేర్ చేసిన అతి కొద్ది కాలంలోనే లక్షలసంఖ్యలో లైకులు, కామెంట్లు వచ్చాయి.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే అనుష్క శెట్టి టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన “నిశ్శబ్దం” అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది.

కానీ ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.దీంతో అనుష్క శెట్టి తన తదుపరి చిత్రాల కథల విషయంలో కొంతమేర ఆచితూచి అడుగులు వేస్తోంది.

కాగా ఇటీవలే ఈ అమ్మడు టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఓ చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు సోషల్ మీడియా మాధ్యమాలలో బలంగా వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటివరకు ఈ విషయంపై అనుష్క శెట్టి మాత్రం స్పందించలేదు.

#Te;ugu Actress #CollegeLife #DidYou #Anushka Shetty

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Did You Recognize Anushka Shetty In This Group Photo Related Telugu News,Photos/Pics,Images..