ఈ ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా...?

తెలుగులో ప్రముఖ దర్శకుడు బి.వి.

 Heroine Bhavana Childhood Photos, Bhava Childhood Photos, Viral,bhavana, Tollywo-TeluguStop.com

రమణా రెడ్డి దర్శకత్వంలో వచ్చినటువంటి “ఒంటరి” అనే చిత్రంలో టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ కి జంటగా నటించి తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన కేరళ కుట్టి భావన ప్రేక్షకులకు సుపరిచితమే.అయితే తెలుగులో ఈ అమ్మడు నటించింది కొన్ని చిత్రాలలో అయినప్పటికీ తన అందం, నటన, అభినయంతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

తెలుగులో వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న సమయంలో కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల కొంత కాలం పాటు తెలుగు సినీ పరిశ్రమకు దూరం అయింది.ఏమైందో ఏమో కానీ అప్పటి నుంచి ఈ అమ్మడు మళ్ళీ తెలుగు సినీ పరిశ్రమ వైపు కన్నెత్తి చూడలేదు.

అయితే తాజాగా హీరోయిన్ భావన కి సంబంధించినటువంటి ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది అయితే ఆ ఫోటోని ఒకసారి పరిశీలించినట్లయితే చిన్నప్పుడు నటి భావన తన స్కూల్ యూనిఫారం దుస్తులలో దిగినట్లు తెలుస్తోంది.దీంతో కొంత మంది నెటిజన్లు ఈ ఫోటోని నెట్టింట్లో బాగానే వైరల్ చేస్తున్నారు.

 అంతేగాక ఇప్పటి లాగే చిన్నప్పుడు కూడా భావన చాలా క్యూట్ గా ఉందని అంటూ కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం భావన కన్నడలో “ఇన్స్పెక్టర్ విక్రమ్” అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

కాగా ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ పనులు దాదాపుగా పూర్తి అయినట్లు సమాచారం. దీంతో ఇటీవలె భావన బజరంగీ – 2 అనే చిత్రంలో కూడా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube