ఈ ఫోటోలో ఉన్న చిన్నప్పటి హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా.....?

తెలుగులో ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించినటువంటి జగదేకవీరుడు అతిలోక సుందరి చిత్రంలో చిన్న పాప పాత్రలో నటించి తన ముద్దు ముద్దు మాటలతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నటువంటి బేబీ షామిలీ తెలుగు ప్రేక్షకులకు బాగానే గుర్తుంటుంది.అయితే బేబీ షామిలీ చిన్నప్పుడే పలు చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలు చేస్తూ నటిగా సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

 Baby Shamili, Tollywood Heroine, Oy Movie Heroine, Tollywood-TeluguStop.com

అయితే తాజాగా బేబీ షామిలీకి సంబంధించినటువంటి కొన్ని ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి.అయితే ఆ ఫోటోలలో బేబీ షామిలీ తన కుటుంబ సభ్యులతో కలిసి దిగినట్లు తెలుస్తోంది.

దీంతో పలువురు నెటిజన్లు బేబీ షామిలీ చిన్నప్పుడు చాలా ముద్దుగా ఉందని అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు.మరికొంత మంది బేబీ షామిలి నటించిన పాత్రలలో ముద్దుముద్దుగా చెప్పినటువంటి డైలాగులను  ఫోటోలకి వల్లిస్తున్నారు.

కాగా  ఈ అమ్మడు హీరోయిన్ గా 2009వ సంవత్సరంలో టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఆనంద రంగా దర్శకత్వం వహించినటువంటి ఓయ్  అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయింది.కానీ షామిలీ చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా బాగానే రాణించినప్పటికీ హీరోయిన్ గా మాత్రం నిలదొక్కుకోలేక పోయింది.

దీనికి తోడు ఈ అమ్మడు నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా నిలవడంతో బేబీ షామిలి సినీ కెరియర్ అంత ఆశాజనకంగా నట్లులే తెలుస్తోంది.

అయితే ప్రస్తుతం తెలుగు సినిమాలకు సంబంధించి ఈ అమ్మడి చేతిలో పెద్దగా సినీ అవకాశాలు లేవు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా బేబీ షామిలీ 2018వ సంవత్సరంలో టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య హీరోగా నటించినటువంటి అమ్మమ్మగారిల్లు అనే చిత్రంలో చివరిసారిగా కనిపించింది.ఇక అప్పటి నుంచి ఈ అమ్మడు మళ్లీ తెలుగులో కనిపించలేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube