మేకప్ లో లేని ఈ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టండి చూద్దాం…?

తెలుగులో యంగ్ దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహించిన  "టాక్సీవాలా" చిత్రంలో టాలీవుడ్ రౌడి విజయ్ దేవర కొండ సరసన నటించి  తెలుగు ప్రేక్షకులను బాగా అలరించిన రాయలసీమ బ్యూటీ ప్రియాంక జవాల్కర్ గురించి తెలియని వారుండరు.

అయితే ఈ అమ్మడు వచ్చీ రావడంతోనే తన అందం, నటనతో ప్రేక్షకులని కట్టిపడేసింది.

అయితే తాజాగా ఈ అమ్మడికి సంబంధించినటువంటి ఓ ఫోటో  సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ హల్ చల్ చేస్తోంది.

అయితే ఈ ఫోటో ఒకసారి పరిశీలించినట్లయితే సినిమాల్లోకి రాక ముందు ప్రియాంక జవాల్కర్ ఎలా ఉండేదో మనకి స్పష్టంగా తెలుస్తుంది.

అయితే  ఫోటో విషయమై అప్పట్లో ప్రియాంక జవాల్కర్ స్పందిస్తూ ఆ ఫోటో తనదేనని అప్పుడెప్పుడో సినిమాల్లోకి రాక ముందు కాలేజీలో చదివే రోజుల్లో తీసుకున్నదని,  కానీ ఆ ఫోటో ఎలా బయటికి వచ్చిడ తనకీ అర్థం కావడం లేదని కూడా తన అధికారిక సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తెలిపింది.