చిరంజీవి మేన కోడలు మలయాళంలో హీరోయిన్ అని మీకు తెలుసా…?  

Did You Recognise These Telugu Actress Lakshmi Lahari - Telugu Lakshmi Lahari, Telugu Actress. Malayala Heroine, Tollywood

తెలుగులో ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ దర్శకత్వం వహించినటువంటి ఇంద్ర అనే చిత్రంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మేనకోడలు నందిని పాత్రలో నటించిన నటి లక్ష్మీ లాహిరి గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయవలసిన అవసరం లేదు.

 Did You Recognise These Telugu Actress Lakshmi Lahari

అయితే ఈ అమ్మడు తెలుగులో చాలా సినిమాల్లో నటించినప్పటికీ ఆ పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో ఎవరూ గుర్తించలేదు.చివరికి మెగాస్టార్ చిత్రంలో నటిస్తేనైనా గుర్తింపు వస్తుందనుకుంటే ఆ అవకాశం కూడా తీవ్ర నిరాశ పరిచింది.

అయినప్పటికి లక్ష్మీ లాహిరి పట్టువిడవకుండా అవకాశాల కోసం బాగానే శ్రమించింది.

చిరంజీవి మేన కోడలు మలయాళంలో హీరోయిన్ అని మీకు తెలుసా…-Latest News-Telugu Tollywood Photo Image

ఈ క్రమంలో మలయాళం భాషలో ప్రముఖ నటుడు, మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి హీరోగా నటించినటువంటి “పలుంకు” అనే చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకుంది.

ఈ ఒక్క సినిమా ఆమె జీవితాన్ని మార్చేసింది.అంతేకాక తెలుగులో పలు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పనిచేసి గుర్తింపు తెచ్చుకోలేక పోయిన లక్ష్మీ లాహిరి మలయాళ  భాషలో మాత్రం హీరోయిన్ గా వరుస అవకాశాలు దక్కించుకుంటూ బాగానే రాణిస్తోంది.

ఒకానొక సమయంలో అవకాశాల కోసం పలు బి గ్రేడ్ చిత్రాల్లో కూడా నటించింది.

అలాగే తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి ఈటీవీలో అప్పట్లో ప్రసారమయ్యేటువంటి దుర్గ అనే సీరియల్లో కూడా ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించింది.

అలాగే మలయాళం భాషలో కూడా శ్రీమద్భాగవతం, దేవి మహత్యం వంటి ధారావాహికలో కూడా నటించింది.ఇక చిత్రాల పరంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం తదితర భాషలలో కూడా నటించింది.

దీంతో ప్రస్తుతం లక్ష్మీ లహరి మలయాళం భాషలో చేతినిండా ఆఫర్లతో దూసుకుపోతోంది.అందుకే అంటారు పెద్దలు కష్టాలను ఎదుర్కొంటూ జీవితాన్ని సాగిస్తుంటే ఖచ్చితంగా ఏదో రోజు విజయం సాధిస్తారని.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Did You Recognise These Telugu Actress Lakshmi Lahari Related Telugu News,Photos/Pics,Images..

footer-test