చిరంజీవి ఆచార్య టీజర్ లో ఈ విషయాలు గమనించారా..?

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది.ఆచార్య టీజర్ ని రిలీజ్ చేసి మెగాస్టార్ తన అభిమానులకు పవర్ ఫుల్ గిఫ్ట్ ఇచ్చేశాడు.

 Did You Observe These Things In Chiranjeevi Acharya Movie Teaser , Chiranjeevi A-TeluguStop.com

అనుకున్నట్లుగా ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఆచార్య టీజర్ అదిరిపోయింది.కొరటాల శివ, చిరంజీవి కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా మ్యాజిక్ క్రియేట్ చేయబోతుందని టీజర్ ని చూస్తే అర్ధమవుతోంది.

పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా.అందరూ ఎందుకు ఆచార్య అంటుంటారు.

బహుశా గుణపాఠాలు చెబుతానేమోనని చిరంజీవి చెప్పిన డైలాగ్ అదిరిపోయింది.

మొత్తం ఒక నిమిషం 7 సెకన్ల నిడివి గల ఈ టీజర్ తో ఆచార్య సినిమా మీద భారీ అంచనాలు క్రియేట్ చేశారు.

ఈ సినిమా ప్రేక్షకులకు కనువిందు చేయడం ఖాయమని తెలుస్తోంది.ఆచార్య సినిమాలో రామ్ చరణ్ పవర్ ఫుల్ రోల్ లో కనిపిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.ఈ టీజర్ కూడా రామ్ చరణ్ వాయిస్ ఓవర్ తోనే ప్రారంభమవుతుంది.ఇతరుల కోసం జీవించే వారు దైవంతో సమానం…అలాంటి వారి జీవితాలే ప్రమాదంలో పడితే.

ఆ దైవమే వచ్చి కాపాడాల్సిన పని లేదు.అని రామ్ చరణ్ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ తో టీజర్ ప్రారంభమవుతుంది.

ఆచార్యలో దేవాదాయశాఖలో పనిచేసే ఉద్యోగిగా చిరంజీవి కనిపిస్తాడు.రామ్ చరణ్ సిద్ అనే యువకుడి పాత్ర పోషిస్తున్నాడు.

దేవాలయాల్లో జరుగుతున్న అవినీతి, అక్రమాల కథాంశంగా ఈ సినిమా రూపుదిద్దుకుందని తెలుస్తోంది.ఆలయాలకు కొందరి అక్రమార్కుల నుంచి ఆచార్య ఎలా విముక్తి కల్పించాడనే అంశం కళ్లకుకట్టినట్టు చూపించారని టీజర్ ని చూస్తే తెలుస్తోంది.

Telugu Acharya, Acharyateaser, Acharya Teaser, Chiranjeevi, Ram Charan-Telugu St

ఇక టీజర్ లో కనిపించిన విషయాల గురించి మాట్లాడుకుంటే.రామ్ చరణ్ డైలాగ్ తర్వాత టీజర్ లో 8వ సెకన్ దగ్గర అజయ్ సీన్ లో కనిపిస్తాడు.ఆచార్య సినిమాలో ఓ వర్గం వారు ఆలయాలను పరిరక్షించే బాధ్యత చేపడతారు.వీరికి కష్టాలు ఎదురవడంతో మన ఆచార్య రంగంలోకి దిగి ఎలా పరిష్కరించాడనేదే కథ సారాంశమని అర్ధమవుతుంది.

ఇక తర్వాత 13వ సెకన్ వద్ద అజయ్ ని విలన్లు కత్తితో పొడుస్తూ కనిపిస్తారు.అంటే ఆచార్య సినిమాలో అజయ్ కీ రోల్ పోషించాడని అర్ధమవుతుంది.15వ సెకన్ నుంచి 18వ సెకన్ వరకు ఆ ప్రాంతంలోని ప్రజలు ఊరు వదిలి వెళ్లిపోతున్న దృశ్యాలు కనిపిస్తాయి.వీరందరినీ రక్షించే బాధ్యత తీసుకున్న ఆచార్య విలన్లకు గుణపాఠం చెబుతాడు.

టీజర్ లో 19వ సెకన్ వద్ద చిరంజీవి ఎర్రటి మఫ్లర్ వేసుకున్న సీన్ కనిపిస్తుంది.ఆలయాలు పరిరక్షించడం అంటే దేవుడిని రక్షణాగా ఉండటమని అర్ధం.

అందుకు గుర్తుగా ఎర్రటి క్లాత్ ని ధరించాడు చిరంజీవి.ఇక టీజర్ 32 సెకన్ వద్ద శూలం, పక్కనే చిరంజీవి విలన్ ని పైకి ఎత్తిన ఇమేజ్ కనిపిస్తుంది.

పైన ఒక గ్రహం కూడా చూడొచ్చు.దీన్ని బట్టి ఆచార్య సినిమాలో జ్యోతిష్యం కూడా కీలకం కానుందని తెలుస్తోంది.

Telugu Acharya, Acharyateaser, Acharya Teaser, Chiranjeevi, Ram Charan-Telugu St

దేవాలయాలను కాపాడే టీమ్ కి లీడర్ మన రామ్ చరణ్.రామ్ చరణ్ అనుచరుడు అజయ్.రామ్ చరణ్,, అజయ్ ని విలన్లు చంపేశాక.ఆచార్య చిరంజీవి ఎంటరవుతాడు.రామ్ చరణ్ ఆశయాలకు అనుగుణంగా .అతని బాధ్యతలను భుజాన వేసుకుని దేవాలయాలను పట్టి పీడిస్తున్న దుష్ట శక్తులను అంతమొదించే పాత్రలో చిరంజీవి కనిపిస్తాడు.మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి సినిమాలో తనయుడు రామ్ చరణ్ ప్రధాన పాత్రలో పోషిస్తున్నాడు.సిధ్ పాత్రతో మొదలై.ఆచార్య కారెక్టర్ తో విలన్ల పనిపట్టే ఈ సినిమా టీజర్ ట్రెండ్ సెట్ చేస్తోంది.టీజర్ వచ్చేసింది.

మరి సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులు మాత్రం సమ్మర్ వరకు ఆగాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube