కొరటాల,ఎన్టీఆర్ 30 లో ఈ చిన్న విషయాన్ని గమనించారా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర నటుడిగా కొనసాగడమే కాకుండా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందారు.ఈ సినిమా అనంతరం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో తన 30 వ చిత్రాన్ని ప్రకటించారు.

 Did You Notice This Little Thing In The Ntr30 , Jr Ntr, Tollywood, Ntr 30, Telugu Film Industry, Alia Bhatt, Rashmika, Kiara, Janvi Kapoor-TeluguStop.com

ఇక ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా కొరటాల శివ సినిమాకు సంబంధించిన మోషన్ టీజర్ విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే.ఈ వీడియోలో ఎన్టీఆర్ చెప్పే డైలాగ్స్ ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకున్నాయి.

అయితే ఈ వీడియోలో మీరు ఒక చిన్న విషయాన్ని గమనించారా? ఈ వీడియోలో భాగంగా ఈ సినిమాకు దర్శకుడుగా కొరటాల శివ పేరు, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్, సినిమాటోగ్రఫర్ రత్నవేలు, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్‌ల పేర్లు మనకు కనిపించాయి.అయితే ఈ సినిమాలో నటించే హీరోయిన్ పేరు మాత్రం మనకు కనిపించలేదు.

 Did You Notice This Little Thing In The Ntr30 , Jr Ntr, Tollywood, NTR 30, Telugu Film Industry, Alia Bhatt, Rashmika, Kiara, Janvi Kapoor-కొరటాల,ఎన్టీఆర్ 30 లో ఈ చిన్న విషయాన్ని గమనించారా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇప్పటివరకు ఎన్టీఆర్ కొరటాల కాంబోలో తెరకెక్కే ఈ సినిమాలో అలియా భట్, రష్మిక, కియారా, జాన్వీ కపూర్ వంటి హీరోయిన్ల పేర్లు వినిపించాయి.అయితే వీరి పేర్లు ఎవరివి కూడా ఈ వీడియోలో చూపించలేదు.అంటే ఇంకా ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలనే ఆలోచనలో కొరటాల ఉన్నట్లు తెలుస్తోంది.అందుకే ఇక్కడ హీరోయిన్ పేరు ప్రస్తావించలేదని అర్థమవుతోంది.మరి ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించే అవకాశం ఏ హీరోయిన్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube