కేసీఆర్ లాజిక్ మిస్ అయ్యారా.. సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్‌

కేసీఆర్ ఏది మాట్లాడినా స‌రే అందులో భ‌విష్య‌త్ రాజ‌కీయ ల‌బ్ధి అనేది ఉంటుంద‌ని తెలిసిందే.ఆయ‌న మొద‌టి నుంచి వ్యూహాత్మ‌క మైన మాట‌ల‌తోనే అధికారాన్ని ద‌క్కించుకుంటున్నారు.

 Did You Miss Kcr Logic .. Trolling On Social Media, Kcr, Ts Politics-TeluguStop.com

ఇక‌పోతే కేసీఆర్‌కు గ‌త ప్ర‌భుత్వం హయాంలో చాలా సాఫీగా ఉన్నా ఈసారి మాత్రం చాలా గంద‌ర‌గోళంగా మారింది ప‌రిస్థితి.ఆయ‌న మీద వ్య‌తిరేక‌త ప్ర‌జ‌ల్లోకూడా పెరిగిపోవ‌డంతో కేసీఆర్‌కు టెన్ష‌న్ త‌ప్ప‌ట్లేదు.

ఈ విష‌యం దుబ్బాక ఎల‌క్ష‌న్ల నుంచే క‌నిపిస్తోంది.ఇక ఆ త‌ర్వాత జీహెచ్ ఎంసీ, మొన్న హుజూరాబాద్ ఉప ఎన్నిక ఎంత నిరాశ ప‌రిచిందో చూశాం.

అయితే దుబ్బాక‌, జీహెచ్ ఎంసీలు పెద్ద‌గా కేసీఆర్‌ను ప్ర‌భావం చూపించ‌క‌పోయినా హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ను మాత్రం కేసీఆర్ ఛాలెంజింగ్ గా తీసుకున్నారు.కానీ ఓడిపోవ‌డంతో తీవ్ర నిరాశ త‌ప్ప‌లేదు.

ఇక‌పోతే ఈ ఎన్నిక‌ల త‌ర్వాత మొన్న ప్రెస్ మీట్ పెట్టి బీజేపీపై నిప్పులు చెరిగారు.ఈ సంద‌ర్భంలోనే పెట్రోల్‌, డీజిల్ రేట్ల మీద కూడా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

అయితే ఇక్క‌డే ఆయ‌న పాయింట్ మ‌ర్చిపోయారు.తాము పెట్రోల్‌, డీజిల్ మీద ఎలాంటి వ్యాట్ పెంచలేదని చెప్ప‌డం గ‌మ‌నార‌హం.

తాము పెంచ‌కుండా ఎలా త‌గ్గించేది అన్నారు.

Telugu Bandi Sanjay, Bjp Tg Poltics, Cm Kcr, Petroldieswl, Trolls, Tg, Ts-Telugu

ఈ త‌రుణంలోనే ప్ర‌ముఖ న్యూస్ ఛానెల్ లో 2015లో వ‌చ్చిన వార్త ఒక‌టి బాగా వైర‌ల్ అవుతోంది.ఇందులో రాష్ట్ర ప్ర‌భుత్వం ఒకే నెల‌లో వ‌రుస‌గా రెండోసారి డీజిల్‌, పెట్రోల్ మీద వ్యాట్ ను పెంచేసింద‌ని అందులో క్లియ‌ర్ గా ఉండ‌టం గ‌మ‌నార్హం.కాగాకేసీఆర్ మొన్న చెప్పిన మాట‌ల‌కు కౌంట‌ర్ గా ఈ వీడియోను సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు బాగా వైర‌ల్ చేస్తున్నారు.ఇందులో డీజిల్ మీద 32 శాతానికి, అలాగే పెట్రోల్ మీద 35 శాతం నుంచి 40 శాతానికి పెంచుతున్న‌ట్టు ఉంది.

దీన్ని చూసిన కేసీఆర్ ఎలాంటి స‌మాధానం చెబుతారో అంటూ ఇప్పుడు మీమ్స్ పేలుతున్నాయి.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube