వినడానికి విడ్డూరంగా అనిపించినా కొన్ని విషయాలు నమ్మక తప్పదు.సోషల్ మీడియా వచ్చిన తరువాత ఇటువంటి ఆసక్తికరమైన సంఘటనలు అనేకం వినాల్సి వస్తోంది.
ప్రస్తుతం సోషల్ మీడియా అనేది కామెడీ షోలాగా తయారయ్యింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.ఇక్కడ ప్రతిరోజూ లెక్కలేనన్ని వీడియోలు అప్లోడ్ అవుతూ వుంటాయి.
అయితే అందులో ఏ కొన్నో వైరల్ అవుతుంటాయి.ఈ నేపధ్యంలోనే తాజాగా ఒక వీడియో వైరల్‌గా మారింది.
దీనిలో ఒక యువతి మొక్కజొన్న( corn ) తినడానికి ఒక ప్రత్యేకమైన పద్ధతిని అనుసరించి, బోల్తా పడింది.
ఇక సదరు వీడియోని చూసిన నెటిజనం అయితే నవ్వి పోతున్నారు.ఇక వైరల్ వీడియోలో వున్న మేటర్ విషయానికొస్తే, డ్రిల్ మెషిన్‌కు మొక్కజొన్న పొత్తు గుచ్చి, ఒక అమ్మాయి దానిని తినేందుకు ప్రయత్నిస్తుంది.అది కొంత సమయం వరకు అంతా బాగానే ఉంది.
ఆ తరువాత అనూహ్యంగా ఒక్కసారిగా ఆమె జుట్టు కొద్దిమేరకు మెషీన్‌లో ఇరుక్కు పోతుంది.ఆ తరువాత ఆక్కడ ఇరుక్కుపోయిన జుట్టు కాస్త వూడి వచ్చేస్తుంది.
కాగా ఈ వీడియోని చూసిన నెటిజనం అయితే తెగ నవ్వుకుంటున్నారు.ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఈ వీడియో మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్( micro blogging platform ) అయినటువంటి Xలో జీరో IQ పీపుల్ అనే పేజీలో పోస్ట్ చేయడం జరిగింది.ఆ తరువాతే ఈ తంతు వెలుగు చూసింది.కాగా ఇప్పటివరకూ ఈ వీడియోను 15 వేల 600 మంది వీక్షించడం జరిగింది.ఇక ఈ వీడియో చూసిన ఒక యూజర్.‘అందుకే యువతులు పవర్ టూల్స్‌కు దూరంగా ఉండాలని చెప్పేది’ అని చురక అంటిస్తూ కామెంట్స్ చేశాడు.మరి కొంతమంది యూజర్లయితే నవ్వుతున్న ఎమోజీలు పోస్ట్ చేస్తున్నారు.