యముడికి కూడా దేవాలయం ఉందని మీకు తెలుసా?

సాధారణంగా మనం దేవాలయాలు అంటే శివుడు, వెంకటేశ్వరుడు, వినాయకుడు, లేదా అమ్మవారి ఆలయాల గురించి వినే ఉంటాము.కానీ ఎప్పుడైనా యముడికి గుడి ఉందని మీకు తెలుసా? అవును యమధర్మరాజుకు కూడా ఒక దేవాలయం ఉంది.ఆ గుడి మరెక్కడో కాకుండా మన తెలుగు రాష్ట్రాలలో ఒకటైన తెలంగాణలో యమధర్మరాజు కి గుడిని నిర్మించారు.

 Did You Know Yama Dharma Raja Also Have One Temple-TeluguStop.com

సాధారణంగా ఇతర దేవాలయాలు పేరు వినగానే,లేదా దేవుని పేరు వినగానే ఎంతో భక్తితో చేతులెత్తి నమస్కరిస్తారు.

కానీ యమధర్మరాజు పేరు వినగానే భయభ్రాంతులకు లోనవుతారు.కానీ యమధర్మరాజును  కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు.

 Did You Know Yama Dharma Raja Also Have One Temple-యముడికి కూడా దేవాలయం ఉందని మీకు తెలుసా-Devotional-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కరీంనగర్ జిల్లా జగిత్యాల దగ్గర ఉగ్ర నరసింహుని ఆలయంలో ఈ గుడి ఉంది.ఈ గుడికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి స్వామివారికి విశేష పూజలు అందిస్తున్నారు.

యమధర్మరాజు ఆలయానికి ఎక్కువగా తమ జాతకాలు బాగాలేని వారు, ఎటువంటి పనులు చేసినా కలిసిరాని వారు, మానసిక ప్రశాంతత కోసం ఎక్కువగా ఈ దేవాలయాన్ని సందర్శిస్తారు.ఈ ఆలయంలో యమున్ని దర్శిస్తే ఆ సమస్యల నుంచి విముక్తి పొందుతారని ప్రజల విశ్వాసం.

అంతే కాకుండా శని గ్రహ దోషాలున్నవారు, జాతక దోషాలు ఉన్న వారు ఇక్కడ స్వామి వారిని దర్శించుకోవడం వల్ల ఆ దోషాల నుంచి విముక్తి లభిస్తుందని ఇక్కడి ప్రజల నమ్మకం.

ఈ దేవాలయ మండపంలో గల గండ దీపం లో నూనె పోసి యమధర్మరాజు కు నమస్కరించడం వల్ల యమగండాలు తొలిగిపోతాయి.

దేవాలయంలో ప్రతి నెల భరణి నక్షత్రం రోజున పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు.అంతేకాకుండా దీపావళికి రెండు రోజుల తర్వాత యమద్వితీయ రోజున యముడు తన చెల్లెలి దగ్గరకు భోజనానికి వెళ్లి, తిరిగి వచ్చేటప్పుడు, ఈరోజు ఎవరైతే తమ తోబుట్టువు చేతి వంట తింటారో వారికి నరక బాధలు ఉండవని వరమిస్తాడని ప్రతీతి.15 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ గుడికి కార్తీకమాసంలో భక్తుల రద్దీతో కిటకిటలాడుతుంది.

#Karimnagar #Yamadrarma Raja #Karthika Masam #Jagityala

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube