ఇప్పటికీ పెళ్లి చేసుకొని ఎన్టీఆర్ హీరోయిన్.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

సినీ ఇండస్ట్రీ అంటే ఒక రంగుల ప్రపంచం.ఈ రంగుల ప్రపంచంలో ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం అంచనా వేయడం చాలా కష్టం.

 Did You Know Why Keethy Chawla Not Yet Married Details,  Keerthy Chawla, Tollywo-TeluguStop.com

ఎందుకంటే సినీ ఇండస్ట్రీలో రాత్రికి రాత్రే స్టార్ హీరోలుగా హీరోయిన్ లుగా మారిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు.అలాగే ఒకటి రెండు సినిమాల్లో నటించి ఆ తర్వాత సినీ ఇండస్ట్రీకి దూరమైన హీరో హీరోయిన్లు కూడా ఉన్నారు.

ఇక హీరోయిన్ ల విషయానికి వస్తే చాలామంది హీరోయిన్లు ఇండస్ట్రీకి దూరం అవడానికి ఎన్ని రకాల కారణాలు ఉన్నప్పటికీ ముఖ్య కారణం మాత్రం గ్లామర్ అని చెప్పవచ్చు.అలా తన గ్లామర్ ని మెయింటైన్ చేయలేక ఇండస్ట్రీకి దూరం అయింది ఒకప్పటి హీరోయిన్ కీర్తి చావ్లా.

ఈ ముద్దుగుమ్మ పేరు వినగానే మనందరికీ జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆది సినిమా గుర్తుకువస్తుంది.ఆ సినిమాలో ఆమె చబ్బీ చీక్స్ తో, బబ్లీ లుక్ తో అందంగా కనిపిస్తూ ఉంటుంది.

ఎన్టీఆర్ సరసన ఆది సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.అయితే ఆది సినిమాతో వచ్చిన క్రేజ్ ని మాత్రం కాపాడుకోలేకపోయింది.రెమ్యూనరేషన్ విషయంలో మంచి మంచి అవకాశాలు అన్నీ వదులుకుంది.అలా నెమ్మదిగా ఈమె సినీ ఇండస్ట్రీకి దూరం అవుతూ వచ్చింది.

అలా ప్రేక్షకులు కూడా ఈ హీరోయిన్ ని మర్చిపోయారు.ఆ తర్వాత అడపా దడపా సినిమాలలో నటించినప్పటికీ అవి బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.

Telugu Aadi, Keerthy Chawla, Keerthychawla, Married, Tollywood-Movie

ఇది ఇలా ఉంటే ఈ ముద్దుగుమ్మ ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదట.అయితే ఆమె పెళ్లి చేసుకోక పోవడానికి గల కారణం తెలిసి అభిమానులు నవ్వుకుంటున్నారు.ఆమె పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణం భయం.పెళ్లి తర్వాత ఆ పిల్లల్ని కనాలి.కానీ మొదటి నుండి ఆమెకు హాస్పిటల్ అంటేనే భయమట.అందువల్ల ఆమె పెళ్లి చేసుకోలేదని వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ ముద్దుగుమ్మ డెసిషన్ తెలిసి నెటిజెన్స్ నవ్వుకుంటున్నారు.ప్రపంచంలో ఎవరు నీలా ఉండరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube