గీతాంజలి గిరిజ సినిమాలకు దూరం కావడానికి అసలు కారణమిదే?

కొన్ని సినిమాలు ప్రేక్షకుల హృదయాల్లో చెరిగిపోని ముద్ర వేస్తాయి.అలాంటి సినిమాలలో మణిరత్నం డైరెక్షన్ లో నాగార్జున, గిరిజా షెత్తర్ హీరోహీరోయిన్లుగా నటించిన గీతాంజలి సినిమా కూడా ఒకటి.

 Did You Know Why Geethanjali Fame Girija Suddenly Disappeared  , Geethanjali , G-TeluguStop.com

వందనం అనే మలయాళ సినిమాతో నటిగా గిరిజ మలయాళంలో కూడా సక్సెస్ సాధించారు.గిరిజ తల్లి వ్యాపారంలో రాణించగా గిరిజ తండ్రి కర్ణాటక రాష్ట్రంలో వైద్యుడిగా పని చేసేవారు.

ఇంగ్లాండ్ లోనే పుట్టి పెరిగిన గిరిజ శాస్త్రీయ నృత్యం నేర్చుకోవడానికి 18 సంవత్సరాల వయస్సులో భారత్ కు వచ్చారు.

ప్రస్తుతం గిరిజ లండన్ లో ఉన్నారు.

అయితే క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ గిరిజ ఎక్కువ సంఖ్యలో సినిమాల్లో నటించకపోవడానికి కారణమేంటో ఆమె అభిమానులలో చాలామందికి తెలియదు.సాధారణంగా హీరోయిన్లు తమకు వచ్చిన మూవీ ఆఫర్లను రిజెక్ట్ చేయడాని ఇష్టపడరు.

అయితే స్టార్ హీరోల సినిమాల్లోని మంచి పాత్రలను సైతం గిరిజ సున్నితంగా రిజెక్ట్ చేసేవారు.

Telugu Hrudayanjali, Malyalam, Tollywood-Movie

స్టార్ హీరోల సినిమాలలో ఆఫర్లను వదులుకున్న గిరిజ హృదయాంజలి అనే చిన్న సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు ఆ సినిమాలో నటించడం గమనార్హం.గిరిజ నటించిన హృదయాంజలి సినిమాకు ఏకంగా నాలుగు నంది అవార్డులు వచ్చాయి.గిరిజ ప్రస్తుతం రైటర్ గా లండన్ లో స్థిరపడ్డారు.

ఒక సందర్భంలో స్టార్ హీరోల సినిమాల్లో ఆఫర్లు రిజెక్ట్ చేయడం గురించి గిరిజ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Telugu Hrudayanjali, Malyalam, Tollywood-Movie

చాలామంది దర్శకనిర్మాతలు కథ, పాత్ర చెప్పకుండా డేట్స్ అడిగారని డబ్బు కోసం సినిమాల్లో నటించే వ్యక్తిత్వం తనది కాదని ఆమె అన్నారు.నా అభిరుచికి సరిపోని సినిమాలకు తాను నో చెబుతూ వచ్చానని అంతకుమించి ఆ సినిమాలను రిజెక్ట్ చేయడం వెనుక ముఖ్యమైన కారణం అయితే ఏమీ లేదని గిరిజ చెప్పారు.రైటర్, జర్నలిస్ట్ గా గిరిజ తన సినీ కెరీర్ ను కొనసాగిస్తూ ఉండటం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube