ద్వాదశాధిత్యులు అంటే ఎవరో తెలుసా?

మనకు ఉదయం లేవగానే ఎంతో అందంగా దర్శనమిచ్చేసూర్యభగవానుడు ఒక్కడే అని మాత్రమే తెలుసు.కానీ మనకు కనిపించే సూర్యుడు ఒక్కడే అయినప్పటికీ,12 నెలలు 12 రకాలుగా మనకు దర్శనమిస్తాడన్న విషయం ఎవరికీ తెలియదు.

 Dwadashadithyulu, Hindu Rituals, Hindu Gods, Hindu Believes-TeluguStop.com

మన పురాణాల ప్రకారం అదిథి, కశ్యపుని దంపతులకు కలిగిన 12 మంది సంతానాన్ని ద్వాదశాధిత్యులు అని అంటారు.ఈ 12 నెలల కాలంలో సూర్యుడు ఉండే స్థితిగతులను బట్టి ద్వాదశాదిత్యులు పేర్లు వర్ణించబడ్డాయి.

ద్వాదశాదిత్యల వెంట ఎల్లప్పుడు ఆరుగురు పరిజనులు ఉంటారు.సూర్యునితో పాటు ఈ ఆరుగురు పరిజనులు కూడా సూర్యుని వలె ప్రతి నెల మారుతూ మనకు దర్శనమిస్తారు.

ద్వాదశాదిత్యుల గురించి మహా భాగవతంలోని 12 వ స్కంధం చివరిలో చూడవచ్చు.అయితే ప్రస్తుతం ఏ నెలలో సూర్యుడు ఏ విధంగా మారుతాడు.అలాగే పరిజనులు కూడా ఏ పేర్లతో మారుతారు అన్న విషయాలను గురించి ఇక్కడ తెలుసుకుందాం….

1) దాత చైత్ర మాసం పరి జనులు_కృత స్థలి, హేతి, వాసుకి,రథకృత్తు, పులస్త్యుడు ,తుంబురుడు అనే పరిజనులు ఉంటారు.

2)అర్యముడు – వైశాఖమాసం– పరిజనులు_పుంజికస్థలి, పులహుడు, ఓజస్సు,ప్రహేతి,నారదుకుడు,కంజనీరుడు ఉంటారు.

3)మిత్రుడు –జేష్ట మాసం – పరిజనులు: మేనక,పౌరషేయుడు, తక్షకుడు,రథస్వనుడు, అత్రి ,హాహా అనే పరిజనులు జేష్ట మాసం లో సూర్యునితో ఉంటారు.

4) వరుణుడు – ఆషాడంమాసం – పరిజనులు: రంభ, శుక్రచిత్తు సహజన్యుడు, హూహూ, వసిష్ఠుడు, సృనుడు అనే పరిజనులు ఉంటారు.

5)ఇంద్రుడు – శ్రావణమాసం– పరిజనులు: విశ్వావసువు, శ్రోత, ఏలా పుత్రుడు, అంగిరసు, ప్రమ్లోచ, చర్యుడు ఉంటారు.

6) వివస్వంతుడు – భాద్రపదంమాసం – పరిజనులు: అనుమ్లోద, ఉగ్రసేనుడు, వ్యాఘ్రుడు, అసారణుడు, భృగువు, శంఖపాలుడు.

7)అంశుమంతుడు – మార్గశిరమాసం – పరిజనులు: కశ్యపుడు, తార్క్ష్యుడు, ఋతసేన, ఊర్వశి, విద్యుచ్ఛత్ర, మహాశంఖులు అనే ఆరుగురు పరిజనులు సూర్యుని వెంట మార్గశిర మాసంలో ఉంటారు.

8)త్వష్ట – ఆశ్వయుజమాసం– పరిజనులు: జమదగ్ని, కంబళాశ్వుడు, తిలోత్తమ, బ్రహ్మపేతుడు, శతజిత్తు, ధృతరాష్ట్రుడు.

9) విష్ణువు – కార్తీకమాసం– పరిజనులు: అశ్వతరుడు, రంభ, సూర్యవర్చుడు, సత్యజిత్తు, విశ్వామిత్రుడు, మఖాపేతుడు అనే పరిజనులు ఉంటారు.

10) భగుడు – పుష్యంమాసం– పరిజనులు: స్ఫూర్జుడు, అరిష్టనేమి, ఊర్ణువు, ఆయువు, కర్కోటకుడు, పూర్వజిత్త.

11)పూషుడు –మాఘ మాసం – పరిజనులు: ధనుంజయుడు, వాతుడు, సుషేణుడు, సురుచి, ఘృతావి, గౌతముడు అనే పరిజనులు మనకు దర్శనమిస్తారు.

12. క్రతువు –ఫాల్గుణ మాసం– పరిజనులు: వర్చుడు, భరద్వాజుడు, పర్జన్యుడు, సేనజిత్తు, విశ్వుడు, అనే ఆరుగురు పరిజనులు ఉంటారు.

ఈ విధంగా సూర్యుడు ప్రతి నెల ఒక్కో పేరుతో మనకు కనిపిస్తాడు.12 నెలలు 12 పేర్లతో ఉండటం వల్ల సూర్యుడిని ద్వాదశాధిత్యులు అని పిలుస్తారు.

Dwadashadithyulu, Hindu Rituals, Hindu Gods, Hindu Believes - Telugu Hindu, Hindu Gods, Hindu Rituals #Shorts

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube